Raviteja To Compete With Pawan and Balayya | పవన్-బాలయ్య మధ్యలో మాస్ రాజా.. రిస్క్ చేస్తున్నాడా?

Raviteja s next release date

Raviteja, Touch Chesi Chudu, Touch Chesi Chudu Release Date, Touch Chesi Chudu Movie, Touch Chesi Chudu Raviteja, Touch Chesi Chudu Pawan Balayya, Touch Chesi Chudu Sankranti Race, Touch Chesi Chudu 2018, Touch Chesi Chudu Postpone, 2018 Sankranti Movies, Sankranti Telugu Movies 2018

Raviteja poses challenge to Pawan and Balayya. Touch Chesi Chudu will clash with the big films like Pawan kalyan’s 25th Movie and Balakrishna's Jayasimha during the Sankranti holiday season.

సంక్రాంతి బరిలో టచ్ చేసి చూడు?

Posted: 11/01/2017 11:45 AM IST
Raviteja s next release date

దాదాపు రెండేళ్ల తర్వాత రాజా ది గ్రేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. డీసెంట్ హిట్ నే అందుకున్నాడు. ప్రస్తుతం వసూళ్ల జోరు తగ్గినప్పటికీ నిర్మాతకు నష్టం మాత్రం ఉండకపోవచ్చనే చెబుతున్నారు. ఈ హిట్ తో ఊపు మీద ఉన్న రవితేజ వరుసగా చిత్రాలు కమిట్ అవుతున్నాడు.

ముందు ప్రారంభించిన విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో 'టచ్ చేసి చూడు' ను ప్రస్తుతం సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఆల్రెడీ 50 శాతం షూటింగ్ అయిపోయిన ఈ చిత్రంలో రవితేజ పోలీస్ రోల్ లో కనిపించబోతున్నాడంట. అయితే ఈ చిత్రాన్ని మిగతా పార్ట్ ని రెండు నెలల్లో పూర్తి చేసేసి విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్లు, మాస్ రాజా ఉన్నారంట.

మాస్ తో పాటు ఫ్యామిలీస్ లోనూ రవితేజకు అభిమానులు ఎక్కువే. అందుకే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా మిగతా షెడ్యూల్స్ ను
ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ అది కుదరకపోతే మాత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్రాంతి బరిలోకి దిగడానికి బాలకృష్ణ జయసింహా, పవన్ 25వ చిత్రం(అజ్నాతవాసి) ఉన్నాయి. కానీ, కేవలం కంటెంట్ మీద నమ్మకంతోనే టచ్ చేసి చూడును రిలీజ్ చేసేందుకు ధైర్యం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles