Mahesh Babu and Allu Arjun Picks Same Date | బన్నీ ఫిక్సయ్యిందే మహేష్ కూడా..

Mahesh bunny movies on same date

Mahesh Babu, Allu Arjun, BAN NPS, Bharat Anu Nenu Naa Peru Surya, భరత్ అను నేను నా పేరు సూర్య, మహేష్ బాబు అల్లు అర్జున్, బన్నీ మహేష్, Bunny Mahesh Babu, Mahesh Babu Bunny Same Date, Bharat Anu Nenu Release Date

Mahesh Babu’s next. A new release date has been announced and its April 27, 2018.Interestingly, Allu Arjun’s Naa Peru Surya has been confirmed for April 27 long ago. One has to wait and see if the makers of Bunny NPS stick to the date or pick a new one.

మహేష్-బన్నీ సేమ్ డేట్?

Posted: 10/26/2017 12:37 PM IST
Mahesh bunny movies on same date

పెద్ద స్టార్ల సినిమాల రిలీజ్ టైంలో అభిమానుల మధ్య మాటల యుద్ధం కొంత కాలంగా తగ్గినప్పటికీ.. మరో విషయంలో అది దారుణమైన ప్రభావం చూపుతూ వస్తోంది. ఈ మధ్య కాలంలో అలా పోటీతో రిలీజ్ అయిన దాదాపు అన్ని చిత్రాలు హిట్ లిస్ట్ లో చేరుతున్నప్పటికీ, ఎటొచ్చి కలెక్షన్ల దగ్గరే తేడా కొట్టేస్తోంది.

బడా హీరోలపై నమ్మకంతో భారీ ఎత్తున్న ప్రీ రిలీజ్ లు చేస్తుండటం.. ఆపై థియేటర్ల పంపకం దగ్గర సమస్యలు.. అన్ని చిత్రాలకు ఆదరణ లభిస్తుండటంతో పూర్తి స్థాయి వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. ఈ విషయంలో ఎన్ని ఫిర్యాదులు ఉన్నా.. హీరోలు, మేకర్లు మాత్రం అస్సలు వెనక్కి తగ్గట్లేదు. తాజాగా ఫిల్మ్ నగర్ లో నడుస్తున్న చర్చ ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ కు మరో ఇద్దరు బడా స్టార్ల మధ్య పోటీ తప్పదనే చర్చ మొదలైంది.

స్పైడర్ చిత్ర షూటింగ్ ఆలస్యం కావటంతో ఆ ప్రబావం మహేష్ తర్వాతి చిత్రం భరత్ అను నేనుపై పడింది. ఈ క్రమంలో సంక్రాంతికి రావాల్సిన ఆ చిత్రం సమ్మర్ కు వాయిదా పడిందని కొంత కాలంగా చెప్పుకుంటున్నాం. అయితే చిత్ర యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే.. ఏప్రిల్ 27 తేదీని ఫిక్స్ చేశారని. కానీ, అదే తేదీని ఎప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం కోసం కేటాయించి ఉన్నాడు. సినిమా ఓపెనింగ్ టైంలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయటం బన్నీ అలవాటుగా మార్చుకున్నాడు. అన్నమాట ప్రకారం అదే తేదీలకు విడుదల చేస్తున్నాడు కూడా. మరి మహేష్ చిత్రం రాకతో అది మారుతుందా? లేక మహేషే వెనక్కి తగ్గుతాడా? ఇంతకు ఒకటి రెండు రోజల తేడాతో పెద్ద చిత్రాలు రిలీజ్ అయినప్పటికీ.. ఇప్పుడు ఇద్దరూ ఒకే తేదీని ఫిక్స్ చేసుకోవటంతో ఏం జరగబోతుందోనని అప్పుడే చర్చ మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles