Vijay Father Slammed BJP over Religion Mark | బీజేపీకి హీరో తండ్రి కౌంటర్.. విజయ్ మతం ఏంటో చెప్పేశాడు

Vijay father about religion

Actor Vijay, Actor Vijay Religion, Actor Vijay Christian, Actor Vijay an Indian, Vijay Father BJP, SA Chandrasekhar BJP, SA Chandrasekhar H Raja, Raja Vijay Voter Card

Actor Vijay's Father SA Chandrasekhar Responded over BJP Religion Remark. Vijay Joseph is an Indian he clarified.

విజయ్ మతంపై తండ్రి స్పందన

Posted: 10/24/2017 03:47 PM IST
Vijay father about religion

బీజేపీ విధానాలను తప్పుబడుతూ.. డైలాగులున్న మెర్సల్ చిత్రంపై వివాదం సర్దుమణగటం లేదు. ఓవైపు నిర్మాతలు వాటిని తొలగించేందుకు సిద్ధమని ప్రకటించినప్పటికీ... బీజేపీ నేత రాజా మాత్రం వివాదాన్ని మరో మలుపు తిప్పారు. రెండు రోజుల క్రితం ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ విజయ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.

విజయ్ క్రిస్టియన్, అందుకే...

విజయ్ ఓటర్ ఐడీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, విజయ్ మతం మార్చుకున్నాడని, అతని పేరు సి.జోసెఫ్ విజయ్ అని చెబుతూ... సినిమాలో గుళ్లకు బదులు.. ఆస్పత్రులు కట్టించవచ్చు కదా అని డైలాగ్ ఉందని.. గుళ్ల బదులు చర్చి అని చెప్పొచ్చుగా అంటూ రాజా చురకలంటించాడు. విజయ్ ది మోదీ వ్యతిరేక విధానమే కాదు.. హిందుత్వానికి కూడా అని రాజా ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన విజయ్ తండ్రి చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుమారుడ్ని జోసఫ్‌ విజయ్‌ అని సంబోధిస్తున్నారని...ఆ పేరులో తప్పేముందని? ఆయన ప్రశ్నించారు. ‘‘విజయ్‌ క్రిస్టియనో లేక ముస్లిమో.. హిందువో కాదు. విజయ్ ఒక మనిషి.. అంతకుమించి భారతీయడు’’ అని ఆయన తెలిపారు. తనను అడిగితే ప్రజలకు సేవచేసేందుకు విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఆ విషయంలో విజయ్ నిర్ణయమే అంతిమమన్న ఆయన, తాను బలవంతం చేయబోనన్నారు. ఇక తన పేరు చంద్రశేఖర్‌ అంటే శివుడని అర్థమని ఆయన చెప్పారు. ‘మెర్సల్‌’ సినిమాలో చర్చనీయాంశమైన అంశాలను తొలగించేందుకు నిర్మాత అంగీకరించిన తరువాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? అని ఆయన ప్రశ్నిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles