Pawan Movie First look on Trivikram Birthday | త్రివిక్రమ్ పుట్టిన రోజునే పవన్ అజ్నాతవాసి??

Pawan movie first look date

Pawan Kalyan, Pawan Kalyan New Movie, Pawan Kalyan First look, Pawan Kalyan Trivikram Birthday, PK 25 Trivikram Birthday, Pawan Kalyan New Movie, Pawan Kalyan First look

Pawan Kalyan 25th Movie title reveal on Trivikram's birthday. Sources further added the reason for the delay in title announcement is only because the team couldn’t decide a perfect title, now everything is sorted out. Pawan fans have to to keep waiting until 7th November 2017.

పవన్ ఫస్ట్ లుక్ అప్పుడేనా?

Posted: 10/24/2017 05:03 PM IST
Pawan movie first look date

కేవలం కాన్సెప్ట్ పోస్టర్ తో మాత్రమే సరిపెట్టిన త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ విషయంలో ఇంత వరకు క్లారిటీ ఇవ్వకుండా పోయాడు. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. పాటలతో కూడిన ఈ సినిమా చివరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ కాన్సెప్ట్ పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేశారు.

టైటిల్ తో కూడిన లుక్ ఇంతవరకూ రాలేదు. 'అజ్ఞాతవాసి' ‘బాటసారి’ అనే పేర్లు వినిపిస్తున్నాయి గానీ, టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. దసరా, దీపావళికి ఇలా వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూశారుగానీ, అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. ఇక వచ్చేనెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజు కావడం వలన, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారనేది తాజా సమాచారం. ఈ మేరకు బాధ్యతలను త్రివిక్రమ్ కే వదిలిపెట్టినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా అడ్వాన్స్ గా ఒక్క రోజు ముందే.. అంటే జనవరి 9వ తేదీ .. సెకండ్ షో నుంచి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles