Mega Chance for Nagini Actress Mouni Roy | సీరియల్ హాటీకి బంఫరాఫర్

Serial beauty joins brahmastra

Nagini Fame Mouni Roy, Mouni Roy Brahmastra, Brahmastra Movie, Amitabh Bachchan Mouni Roy, Mouni Roy Karan Johar, Mouni Roy Big B, Brahmastra Movie Cast, Brahmastra Actress, Brahmastra Movie Release Date

Nagini Fame Mouni Roy Joins Brahmastra. Amitabh Bachchan, Alia Bhatt, Ranbir Kapoor's New Film. Brahmastra will reportedly begin shooting early next year and will have Mouni joining the sets from the first schedule.

అమితాబ్ చిత్రంలో సీరియల్ బ్యూటీ

Posted: 10/24/2017 03:23 PM IST
Serial beauty joins brahmastra

బుల్లితెర నుంచి సినిమాల్లోకి రావటం ఈ మధ్య చాలా సులువుగా మారింది. యాక్టింగ్ టాలెంట్ తోపాటు కాస్త స్కిల్స్ చూపిస్తే చాలూ ఇట్టే ఛాన్సులు దక్కించుకోవచ్చు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఓ బ్యూటీకి ఏకంగా 100 కోట్ల పై చిలుకు బడ్జెట్ సినిమాలోనే ఛాన్స్ దక్కింది.

కలర్స్ ఛానెల్ లో వచ్చిన నాగిన్ (తెలుగులో నాగిని)` టీవీ సీరియ‌ల్ తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న‌టి మౌని రాయ్. ఆమె బాలీవుడ్ తెరంగేట్రం కోసం ఎప్ప‌ట్నుంచో అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అక్ష‌య్ కుమార్‌ `గోల్డ్‌`లో ఆమె నటిస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో బంఫరాఫర్ ఆమె ఖాతాలో వచ్చి చేరింది. కరణ్ జోహర్ నిర్మాతగా తెరకెక్కించబోయే భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మస్తలో మౌని ఓ పాత్ర దక్కించుకుంది.

అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ వంటి అగ్ర‌తారాగ‌ణంతో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం నిజంగా మౌని రాయ్ అదృష్ట‌మ‌ని సినీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. సినిమా షూటింగ్ మొద‌టి షెడ్యూల్‌లోనే మౌని రాయ్ పాల్గొంటుంద‌ని ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ వెల్ల‌డించారు. మరి ఈ హాట్ బ్యూటీ వెండితెరపై ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.మూడు పార్టులుగా తెరకెక్కబోతున్న బ్రహ్మస్త్రలో మొదటి భాగం 2019 ఆగష్టు 15న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles