Allu Arjun's Naa Peru Surya First Look on Dussehra | బన్నీ నుంచి ఈ ట్విస్ట్ అస్సలు ఊహించి ఉండరు.

Allu arjun dussera gift

Allu Arjun, Na Peru Suriya Movie, Allu Arjun First Look, Allu Arjun New Movie, Allu Arjun Dussehra Treat, Bunny New Movie First Look

Allu Arjun's Naa Peru Surya Na Illu India first look on Dussehra. makers not officially announced it.

దసరాకి నా పేరు సూర్య ఫస్ట్ లుక్

Posted: 09/14/2017 06:50 PM IST
Allu arjun dussera gift

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జోరు మాములుగా లేదు. తాజా చిత్రంగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తెరకెక్కుతోంది. దర్శకుడిగా ఇది తనకి తొలి చిత్రం కావడంతో, పైగా కొందరు స్టార్ హీరోలు తన కథను రిజెక్ట్ చేయటంతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వక్కంతం వంశీ వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.

ఈ షెడ్యూల్ ను ఊటీలో ప్లాన్ చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా ఫస్టులుక్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరాకి ఫస్టులుక్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. విజయదశమి సందర్భంగా నా పేరు సూర్య ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుందనేది అధికారిక సమాచారం కాకపోయినా దాదాపు ఖాయమైందని చిత్ర యూనిట్ చెబుతోంది.

దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ మరింత ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. బన్నీ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుండగా, మరో హీరోయిన్ కు కూడా స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles