Bharath Anu Ninu Bollywood Rights for Record Price

Mahesh bharath anu nenu after baahubali in hindi rights

Mahesh Babu, Bharath Anu Nenu, Bharath Anu Nenu Bollywood Price, Bharath Anu Nenu Satellite Rights

Mahesh Babu's Bharath Anu Ninu Bollywood Rights Sold Out for Record Price. Mahesh Move placed after Baahubali.

భరత్ అను నేను బాలీవుడ్ రైట్స్ అమ్మకం

Posted: 09/04/2017 04:07 PM IST
Mahesh bharath anu nenu after baahubali in hindi rights

శ్రీమంతుడి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన మహేష్-కొరటాల కాంబినేషన్ లో భరత్ అను నేను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్పైడర్ అంత కాకపోయినా.. సుమారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోవటంతో అందుకు తగ్గట్లే బిజినెస్ కూడా మొదలుపెట్టేసింది.

ఈ సినిమా హిందీ ఆల్ రైట్స్ 13 కోట్లకి అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే... 'బాహుబలి'ని మినహా ఇస్తే మరే సినిమాకి ఈ స్థాయి రేటు పలకలేదు. ఇక ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 18 నుంచి 20 కోట్లకు దక్కించుకోవడానికి రెండు భారీ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఈ హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారనేది రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.

మహేష్ క్రేజ్ కొరటాల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ రావడం ఈ స్థాయి రేటు పలకడానికి ప్రధానకారణంగా చెప్పుకుంటున్నారు. జనవరి 11న సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles