ధనుష్ అక్కడ రజనీ కంటే ఎక్కువే... | Dhanush Break Kabali Screening Record There

Vip 2 break kabali record

Dhanush, Dhanush VIP 2, Dhanush VIP 2 Malaysia, Malaysia Kabali Screens, Kabali Record Break Dhanush, VIP 2 Malaysia, VIP 2 Kabali, Dhanush Malaysia Kabali, Rajinikanth Malaysia Craze, Dhanush VIP 2 Screens

Dhanush's VIP 2 to release in Malaysia across 550 screens. Previously Superstar Rajinikanth’s gangster drama Kabali was released on 480 screens in Malaysia in 2016. Now Dhanush Break the Record with Highest Screens.

కబాలి రికార్డును బ్రేక్ చేసిన వీఐపీ-2

Posted: 08/08/2017 02:06 PM IST
Vip 2 break kabali record

రజనీకాంత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా గతేడాది రిలీజ్ అయిన కబాలి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా టాక్ మాట అటుంచి కలెక్షన్లపరంగా మాత్రం కొత్త రికార్డులే
నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ అయిన చిత్రంగా కబాలి నిలిచింది. అఫ్ కోర్స్ తర్వాత బాహుబలి-2 ఆ రికార్డును తుడిచేసింది.

అయితే సినిమా మేజర్ పార్ట్ చిత్రీకరణ జరిగిన మలేషియాలో మాత్రం 480 స్క్రీన్లలో రిలీజ్ అవ్వగా, ఇంతవరకు ఏ ఇండియన్ చిత్రం కూడా దానిని అధిగమించలేకపోయింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఓ చిత్రం దానిని బద్ధలు కొట్టేసింది. ధనుష్ హీరోగా రూపొందిన వీఐపీ 2 అక్కడ ఏకంగా 550 స్క్రీన్ లలో రిలీజ్ కాబోతుంది. దీనిని వీ క్రియేషన్స్, మాలిక్ స్ట్రీమ్స్ వాళ్ళు సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ధాను తన ట్విట్టర్ లో తెలియజేశాడు.

సింగపూర్ లో చిత్రానికి 'పీ 13' సర్టిఫికెట్ లభించటంతో చిన్నారులు కూడా చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే థియేటర్ల సంఖ్యను మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కాజోల్ 20 ఏళ్ల తర్వాత సౌత్ చిత్రంలో నటిస్తుండగా, అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  VIP 2  Kabali  Rajinikanth  Highest Screens  

Other Articles