టీజర్ అఫీషియల్ గా చెప్పారు. కానీ, రిలీజ్ డేట్ మాత్రం... | SPYder Team Confirm Mahesh Babu Birthday Treat

Mahesh babu ready with spyder second teaser

SPYder, SPYder Second Teaser, SPYder Teaser, SPYder Mahesh Babu Teaser, SPYder Movie Official Teaser, SPYder Mahesh Birthday Teaser, SPYder Movie Teaser, SPYder Birthday Teaser

Second teaser from SPYder will be out on Mahesh Babu’s birthday. SPYder will hit the big screens on September 27 worldwide and will be released in Telugu and Tamil simultaneously.

అఫీషియల్ : మహేష్ బర్త్ డే కి సెకండ్ టీజర్

Posted: 08/08/2017 12:32 PM IST
Mahesh babu ready with spyder second teaser

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్. రేపు సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేస్తారని చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేసింది. ఆగష్టు 9న ఏ టైంలో రిలీజ్ చేస్తారా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మహేశ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ లో పెద్దగా మ్యాటరేం లేకపోవటంతో కనీసం ఈ టీజర్ లో అయినా అంచనాలను మరింతగా పెంచేలా ఈ టీజర్ ను మురుగదాస్ కట్ చేశారని అంటున్నారు.

తెలుగు .. తమిళ భాషల్లో సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేవెసుకోవడం ఖాయమనేది ఫ్యాన్స్ మాట. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పై యాక్షన్ డ్రామాలో ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తుండగా, ప్రేమిస్తే భరత్ ఓ కీ రోల్ పోషిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  SPYder Movie  Birthday Teaser  

Other Articles