ధనుష్ రియల్ శ్రీమంతుడు అయ్యాడుగా.. | Kollywood Hero Now Become Srimanthudu

Dhanush helps farmers in his village

Dhanush Srimantudu, Dhanush Help Farmers Family, Deceased Farmers families Dhanush, Dhanush Financial Help, DHanush Helping Nature, Kollywood Star Help, Rajinikanth Son in Law Help, Dhanush Help farmers, Tamil Nadu Farmers Dhanush

Dhanush’s Financial Support For Families of Farmers his own village Shankarapuram. The actor has extended his support by donating 50 thousand rupees to 125 families making it to 63 lakh rupees. The actor said that he could not take it up and has decided to extend his help to 125 families in the first phase. He said that he is going to do the same for more families.

రైతు కుటుంబాలను ఆదుకున్న ధనుష్

Posted: 08/03/2017 06:02 PM IST
Dhanush helps farmers in his village

కోలీవుడ్ హీరో ధనుష్ కి అక్కడ ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొంత కాలంగా సుచీ లీక్స్ తో వార్తల్లో నానుతూ వస్తున్న రజనీ అల్లుడికి హిట్లు కూడా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో వీఐపీ 2 తో రాబోతున్నాడు. ఫస్ట్ టైం తెలుగులో కూడా స్ట్రెయిట్ మూవీతో పలకరించబోతున్నాడు ధనుష్. ఓవైపు ఈ చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉంటూనే.. మరోపక్క తన వంతు సాయం చేస్తున్నాడు.

తమిళనాడులో పంట నష్టాల కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఈ కష్టాన్ని గట్టెక్కలేమని భావించిన వాళ్లు గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. అలా యజమానిని పోగొట్టుకున్న రైతుల కుటుంబాలకు హీరో ధనుష్ తన వంతు సాయాన్ని అందించాడు. తన స్వగ్రామం శంకరాపురం లో కులదైవమైన కురుప్పస్వామి ఆలయాన్ని ఏటా దర్శిస్తుంటాడు ధనుష్. ఈ యేడూ అక్కడ రైతులు పెద్ద సంఖ్యలో చనిపోయారన్న వార్త అతన్ని కదిలించింది.

అంతే వెంటనే స్పందించి వారి జాబితా తెప్పించుకున్నాడు. మొత్తం 125 మందికి మొదటి విడతలో భాగంగా వారి కుటుంబాలకు ఆర్ధిక సాయాన్ని అందించాడు. ఒక్కో ఇంటికి 50,000 రూపాయలను అందించాడు. మరో విడతలో మరికొంత మందికి సాయాన్ని అందించనున్నట్టు తెలిపాడు. ఈ కార్యక్రమంలో భార్య ఐశ్వర్య కూడా పాల్గొనగా, గ్రామస్థులంతా ధనుష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Dhanush  Farmers Help  Tamil Nadu  

Other Articles