25వ బాండ్ కథ పాతదేనా? | James Bond 25th Title and Story reveal

James bond 25 title and villain details reportedly revealed

Shatterhand, James Bond Series, James Bond 25th Movie, James Bond New Movie, James Bond Next, Blind Villain for James Bond, New James Bond, Bond Series 2019, James Bond 2019, James Bond Old Story

Details of James Bond 25 reportedly revealed. Shatterhand fixed as Title and Bond will be journeying to Croatia for a film based on the 2001 novel Never Dream of Dying by Raymond Benson, the author of ‘Tomorrow Never Dies’, ‘The World is Not Enough’ and ‘Die Another Day’. According to sources, Bond scriptwriters feel it could be the perfect follow-up to Spectre. They are hoping to film in Croatia next year.

జేమ్స్ బాండ్ 25వ చిత్రం కథ, టైటిల్ ఫిక్స్

Posted: 08/03/2017 04:32 PM IST
James bond 25 title and villain details reportedly revealed

హీరో ఓ సీక్రెట్ ఏజెంట్ ఉంటాడు. ఎంతకు తెగని ఓ జిడ్డు కేసును సాల్వ్ చేసేందుకు రంగంలోకి దిగుతాడు. గన్ లు, ఛేజింగ్ లు, ఫైటింగ్ లు, మధ్య మధ్యలో అమ్మాయిలతో రొమాన్స్, స్టైలిష్ మేకింగ్ గత యాభై ఏళ్లుగా జేమ్స్ బాండ్ పేరిట హాలీవుడ్ లో సందడి చేస్తున్న సీక్వెల్స్ . ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ ఎంతటి ఆదరణను చూరగొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం మైలు రాయి 25వ చిత్రానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ తయారవుతోంది.

డేనియల్ క్రెయిగ్ దీనిలో హీరోగా మరోసారి కనిపించనున్నాడు. 2019 నవంబర్ లో విడుదల కానున్న చిత్రానికి ఇంతవరకూ 'షట్టర్ హ్యాండ్' అనే వర్కింగ్ టైటిల్ పెట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఓ ఇంటర్నేషనల్ మాగ్జైన్ వెలువరించిన కథనం ప్రకారం క్రొయేషియాలో అత్యధిక భాగం షూట్ చేస్తున్న చిత్రాన్ని రేమాండ్ మెన్సన్ రచించిన 'నెవర్ డ్రీమ్ ఆఫ్ డయ్యింగ్' అనే నవల ఆధారంగా రూపొందిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇక, ఈ పుస్తకం కథాంశం ప్రకారం, బాండ్ ఈ చిత్రంలో టైలిన్ మిగ్నోనీ అనే ఫిల్మ్ స్టార్ తో సంబంధం నడుపుతూ ఉంటాడు. ఆమె భర్తకు ఓ క్రైమ్ ఆర్గనైజేషన్ తో సంబంధాలుంటే, వాటినెలా బాండ్ బయటపెడతాడన్న అంశాలుంటాయి. ఇందులో విలన్ అంధుడు కావడం గమనార్హం. ఇంతకు ముందు యూ ఓన్లీ లివ్ ట్వైస్ అనే సినిమా కూడా దాదాపు ఇదే కథనంతో రావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : James Bond  25th Movie  Shatterhand  

Other Articles