నా పేరు సూర్య... రిలీజ్ డేట్ చెప్పేశారు | Movie Goes on floors Bunny Announced Release Date

Allu arjun s naa peru surya release date announced

Allu Arjun, Bunny Naa Peru Surya, Naa Peru Surya Release Date, Naa Peru Suriya, Naa Peru Suriya Release Date, Bunny Next Release Date

Allu Arjun's Naa Peru Surya went on the floors on Wednesday. Vakkantham Vamsi's directorial outing is said to be a patriotic drama. The filmmakers are planning to shoot a massive battle sequence for the film set in the backdrop of a war. Actress Anu Emmanuel plasy female lead.Makers Announced release date on April 27th 2018.

నా పేరు సూర్య రిలీజ్ డేట్ వచ్చేసింది

Posted: 08/02/2017 06:45 PM IST
Allu arjun s naa peru surya release date announced

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న `నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా` సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిపోయింది. డీజే 50 రోజులు కూడా పూర్తి కాకముందే విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 27, 2018న ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది.

ఇందులో అల్లు అర్జున్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా క‌నిపించేందుకు అమెరికా నుంచి వ‌చ్చిన ట్రైన‌ర్ల స‌మ‌క్షంలో ఫిట్‌నెస్ శిక్ష‌ణ పొందుతున్నాడు. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న అను ఎమ్మాన్యుయేల్ న‌టిస్తోంది. ఈరోజే చిత్ర షూటింగ్ మొదలైంది కూడా.

బాలీవుడ్ సంగీత ద్వ‌యం విశాల్ - శేఖ‌ర్‌లు ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. అయితే ఇంతకు ముందు డీజే విషయంలో కూడా ఇలాగే తొలి షెడ్యూల్ టైంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ చివరి నిమిషంలో లేట్ అయ్యింది. ఒకవేళ అనుకున్నట్లు తేదీకే వస్తే మాత్రం సమ్మర్ సీజన్ కావటంతో మరిన్ని పెద్ద చిత్రాల మధ్య పోటీతత్వం తప్పదనే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Naa Peru Suriya  Release Date  

Other Articles