Crazy Heroine Out From Ram New Movie

Ram movie actress replaces

Megha Akash, Megha Akash Ram Movie, Megha Akash Exit Ram Movie, Nithin Ram Megha Akash, Megha Akash Lavanya Tripati, Megha Akash New Movie, Vunnadi Okate Zindagi Heroine, Ram Vunnadi Okate Zindagi , Ram Lavanya Tripati Movie, Ram Lavanya Tripati Anupama Parameswaran

Vunnadi Okate Zindagi filmmakers had roped in Megha Akash (who even attended the muhurat of the film) as one of the female leads along with Anupama Parameshwaran. However, after the launch, Megha signed another Telugu film LIE opposite Nithiin and got busy with that film shoot in the US. While the makers of Vunnadi Okate Zindagi wanted bulk dates from Megha to complete their shoot, she couldn’t adjust her schedule as she had already committed to the other film. They have now roped in Lavanya Tripathi in place of Megha and want to start the shoot immediately.

మేఘా ఆకాశ్ అవుట్.. లావణ్య ఇన్

Posted: 08/01/2017 09:41 AM IST
Ram movie actress replaces

తొలి మూవీ ఇంకా రిలీజ్ కాకముందే టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ బ్యూటీకి మారిపోయింది మేఘా ఆకాశ్. యాక్టింగ్ సంగతి ఏమోగానీ లై లో అమ్మడి ఫస్ట్ లుక్.. స్టిల్స్ చూసిన యూత్ అంతా ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. దీంతో వరుస ఛాన్స్ లతో టాలీవుడ్ లో మరో బబ్లీ బ్యూటీ పాగా వేయటం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే వచ్చినట్లే మరో క్రేజీ అవకాశం వచ్చి చేజారిపోయింది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికలుగా అనుపమ పరమేశ్వరన్ ను .. మేఘా ఆకాశ్ ను తీసుకున్నారు. ఈ సినిమా లాంచ్ కి కూడా మేఘా ఆకాశ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. లై సినిమా షూటింగ్ మిగిలిన పార్ట్ ప్రస్తుతం ఫారిన్లో జరుగుతుండటం వలన, ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదట.

అందుకే లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి నితిన్ మూవీ దయ వల్ల ఒక మంచి ప్రాజెక్టులో లావణ్య త్రిపాఠి ఛాన్స్ కొట్టేసింది. వచ్చేవారం నుంచి లావణ్య షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఈ సినిమా ఫస్టు లుక్ ను ఆగస్టు 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 30వ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megha Akash  Vunnadi Okate Zindagi  Lavanya Tripati  

Other Articles