హిందూ హీరోయిన్ ను చేసుకున్నాడంటూ...| Super Actress Husband Get Love Jihad Warn

Ayesha takia husband get death threat

Ayesha Takia, Ayesha Takia Husband, Ayesha Takia Husband Threat, Ayesha Takia Fayjer in Law, Ayesha Takia, Love Jihad Ayesha Takia, Farhan Azmi Ayesha Son

Ayesha Takia's Husband Farhan Azmi Gets Death Threats For Marrying 'Hindu Girl. Her Father in Law rarely make sensational comments regard religious.

అయేషా భర్తకు లవ్ జిహాద్ బెదిరింపు

Posted: 07/29/2017 03:08 PM IST
Ayesha takia husband get death threat

సూపర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ అయేషా టకియా గుర్తుందా?. ఓ డజను దాకా చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత ముంబైకి చెందిన పొలిటీషియన్ కమ్ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆ మధ్య రీఎంట్రీ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ వార్తలు కూడా రాగా, వాటిని ఆమె ఖండించింది. ఇక ఇప్పుడు మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.

అయేషా, ఆమె భర్త ఫర్హాన్ అజ్మీ వేర్వేరు మతాలకు చెందిన వారు. దీంతో లవ్ జిహాద్ కు పాల్పడ్డాడంటూ అజ్మీకి బెదిరింపులు వస్తున్నాయంట. స‌మాజ్‌వాదీ పార్టీ నేత అయిన అజ్మీ ఈ మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఫోన్ చేసిన వారు త‌మ‌ను తాము రాజ‌స్థాన్ హిందూ సేన పార్టీకి చెందిన వాళ్ల‌మ‌ని చెప్పిన‌ట్లు అజ్మీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే త‌న తండ్రి అబు అజ్మీని కూడా అంతం చేస్తామ‌ని ఫోన్ కాల‌ర్ బెదిరించిన‌ట్లు ఫ‌ర్హాన్ తెలిపారు.

త‌ర‌చుగా మ‌తాల‌కు సంబంధించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే ఫ‌ర్హాన్ తండ్రి, ఈ మధ్య అజాన్ విషయంలో సింగర్ సుచిత్ర వ్యవహారంలోనూ కామెంట్లు చేశాడు. ఈ నేపథ్యంలోనే టార్గెట్ చేసిన కొందరు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతుంది. అయితే తండ్రి భావ‌జాలానికి ఫర్హాన్ గానీ, కోడలు ఆయేషా గానీ ఎప్పుడూ సపోర్ట్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. అయినప్పటికీ బెదిరింపులు రావటంతో కలవరపాటుకు గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayesha Takia  Love Jihad  Farhan Azmi  

Other Articles