ఆ సీన్లు కూడా అడల్ట్ కిందకే వస్తాయ్.. | CBFC’s New Target No Devadas No Gangster Movies

No smoking drinking depictions on screen

Censor Board, CBFC Chief Pahlaj Nihalani, CBFC Rules, CBFC Drink and Smoke Scenes, Bollywood No Smoke Drink Scenes, CBFC Alcohol Consumption Scenes, CBFC New Chairman, CBFC Pahlaj Nihalani Ousted

CBFC New Rules implemented. Board Chief Pahlaj Nihalani says“A movie where alcohol is essential would have to go with an Adult certificate. Censor board chief Pahlaj Nihalani may lose job after serial controversies.

సెన్సార్ కొత్త రూల్స్.. పొగ, మద్యం తాగే సీన్లున్నా ఏ సర్టిఫికెట్టే!

Posted: 07/25/2017 09:44 AM IST
No smoking drinking depictions on screen

బాలీవుడ్ లో ఇకపై సెన్సార్ రూల్స్ మరింత కఠినం కానున్నాయి. ఇంతకాలం అశ్లీలత కారణంగా సినిమాలకు ఏ రేటింగ్ ఇస్తూ వస్తుండటం తెలిసిందే. కానీ, ఇకపై సినిమాల్లో మందు, పొగతాగే సీన్లు ఉన్నా సరే వాటికి అడల్ట్ సర్టిఫికెట్ ను జారీ చేయాలని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ (సీబీఎఫ్ సీ) నిర్ణయించింది.

సినిమాలో ప్రధాన పాత్రధారులు ఒకవేళ మధ్యం, సిగరెట్లు తాగుతన్నట్లు నటిస్తే మాత్రం ఆ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. నేరప్రవృత్తి పెరిగి పోవటానికి అవి కూడా ఓ కారణం అవుతున్నాయి. యూత్ తమ ఫేవరెట్లను ఇమిటేట్ చేస్తూ చెడిపోతున్నారు కూడా. అందుకే కఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయించామని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. దేవదాస్, షరాబీ లాంటి క్లాస్ సినిమాలు తీసినా ఏ సర్టిఫికెట్ కు సిద్ధమైపోవాల్సిందే.

బోర్డు చైర్మన్ మారుతాడా?

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీ త్వరలో ఆ పదవిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 28న తిరువనంతపురంలో నిహలానీ ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. దర్శక నిర్మాత ప్రకాశ్ ఝా, టీవీ నిర్మాత-నటుడు చంద్రప్రకాశ్ ద్వివేదీలలో ఒకరిని సెన్సార్ బోర్డు చైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దర్శక నిర్మాత మధుర్ బండార్కర్ పేరు కూడా ఈ లిస్ట్ లో ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBFC  Pahlaj Nihalani  Drink and Smoke Scenes  

Other Articles