అకున్ వార్నింగ్.. వర్మ సారీ | RGV Apologized Telangana Excise Department and Akun

Rgv his comments against akun sabharwal

Director Ram Gopal Varma Varma Sorry To Akun Sabharwal, Akun Sabharwal RGV, Varma Telangana Government Comments, Varma Comments Against T Govt, KCR am Gopal Varma, RGV Akun Sabharwal, RGV Apologized T Excise and ED

Director Ram Gopal Varma apologized Telangana Excise And Enforcement Department and Director General Akun Sabharwal.

విచారణ వల్ల ఒరిగేదేం లేదు.. అకున్ కు నా సారీ: వర్మ

Posted: 07/25/2017 11:03 AM IST
Rgv his comments against akun sabharwal

డ్రగ్స్ వ్యవహారంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిట్ పని తీరును, టాలీవుడ్ నే టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడుతూనే ఉన్నాడు. నిన్నటి వరకు సిట్ లక్ష్యంగా విమర్శలు చేసిన వర్మ గత రాత్రి తెలంగాణ పరువు పోయిందని వాపోయాడు. సిట్ విచారణ కారణంగా హైదరాబాదుతో పాటు తెలంగాణ బ్రాండ్ విలువను కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు

ఇంతవరకు కేసీఆర్ సమర్థుడైన రాజకీయనాయకుడని ముంబై వాసులు పేర్కొనే వారని, ప్రస్తుత తీరుతో తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందని పేర్కొన్నాడు. సిట్ విచారణతో పంజాబ్ కంటే తెలంగాణ అధ్వాన్నమైన స్థితిలో ఉందని ముంబైవాసులంటున్నారని పేర్కొన్నాడు. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని రాజమౌళి అమాతం పెంచలచితే...తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అకున్ సబర్వాల్ దేశంలో దిగజార్చారని వర్మ తెల్చేశాడు.

అయితే తాను చేసిన కామెంట్లు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌వి కావ‌ంటూ వ‌ర్మ ఇప్పుడు చెబుతున్నాడు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ప్రొహిబిష‌న్ అండ్‌ ఎక్సైజ్ డైరెక్ట‌ర్ అకున్ స‌భ‌ర్వాల్‌కు, ఎక్సైజ్ శాఖ‌కు క్ష‌మాప‌ణ‌లు తెలియజేశాడని ఓ జాతీయమీడియా కథనం ప్రచురించింది. `పోలీసు శాఖ ప‌నిత‌నాన్ని నేను చిన్న‌బుచ్చ‌లేదు. కేవ‌లం సినిమా ప‌రిశ్ర‌మ‌, సెల‌బ్రిటీల‌ను కొంచెం గౌరవించండి అని మాత్ర‌మే తెలియ‌జేయాల‌నుకున్నా` అంటూ ఆ కథనంలో ఉంది.

అకున్ స‌భ‌ర్వాల్‌ను అమ‌రేంద్ర బాహుబ‌లిగా మీడియా చిత్రీక‌రిస్తుంద‌ని చెబుతూ, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అకున్ హీరోగా బాహుబ‌లి 3 సినిమా తీయాల‌ని ఫేస్‌బుక్‌లో వర్మ వెటకారపు పోస్ట్ తో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనిపై ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఆర్‌.చంద్ర‌వ‌ద‌న్, అకున సబర్వాల్ లు తీవ్ర స్థాయిలోనే స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Akun Sabharwal  

Other Articles