సుమలత భర్తకు సీరియస్? | Rebel Star Hospitalized with Severe Problem

Actor ambareesh hospitalized again

Kannada, Sandalwood, Senior Actor Ambareesh, Ambareesh Hospitalized, Ambareesh Health, Kannada Rebel Star, Rebel Star Serious, Ambareesh Treatment, Actor Ambareesh, Senior Actor Hospitalized

Kannada Senior Actor Ambareesh Hospitalized with Severe Respiratory Problem. But fans have nothing to worry about since it is for regular health checkup.

కన్నడ రెబల్ స్టార్ కు సీరియస్.. ఫ్యామిలీ ఏమంటోంది?

Posted: 07/21/2017 03:42 PM IST
Actor ambareesh hospitalized again

తన నటనతో అశేష అభిమానులను సంపాదించుకుని ఫ్యాన్స్ చేత ముద్దుగా రెబల్ స్టార్ అని పిలిపించుకుంటున్న ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. గురువారం సాయంత్రం శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తడంతో ఆయన్ని హస్పిటల్ లో చేర్పించినట్లు నటి, ఆయన భార్య సుమలత మీడియాకు తెలిపింది.

ప్రస్తుతం బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో వైద్యులు ఎమర్జెన్సీ చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. డాక్టర్ సతీశ్ నేతృత్వంలోని వైద్యుల బృందం గంటకోకసారి బులిటెన్ ను విడుదల చేస్తోంది. అవసరమైన వైద్య పరీక్షలు చేశామని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. 

కాగా, ఈ వార్త తెలియగానే పెద్ద ఎత్తున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఆయనకు ఇలాంటి సమస్యే ఎదురవ్వగా అప్పుడు సింగపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మంజునాథ సినిమాలో రాజుగా నటించిన ఆయన తెలుగువారికి సుపరిచితుడే. గతేడాది పునీత్ రాజ్ కుమార్ ‘దొడ్డమనే హుడుగా’ లో ఆయన చివరిసారిగా కనిపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandalwood  Ambareesh  Hospitalized  

Other Articles