Real Drug Peddler to Puri Jagannadh

Kelvin not direct drugs supplier to puri

Shyam K Naidu, Shyam K Naidu Puri, Shyam K Naidu Booked Puri, Puri Jagannadh, Puri International SIM, Kelvin Shyam K Naidu Puri, Puri Booked in Drug Case

Shyam K Naidu Confess Drug Case. He is the real Real Drug Peddler to Puri. Puri used International SIM to contact Kelvin.

షాకింగ్ నిజాలు ... పూరీకి డ్రగ్ పెడ్లర్ శ్యామే!

Posted: 07/21/2017 03:07 PM IST
Kelvin not direct drugs supplier to puri

సిగరెట్ రుచి తెలీదు.. అలాంటిది డ్రగ్సా అంటూ ఆరోపణలు వచ్చిన రోజు మీడియా ముందు శ్యామ్ కే నాయుడు చెప్పిన కథలు అంతా అబద్ధాలని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ కు డ్రగ్స్ చేరవేసింది శ్యామేనన్న విషయం సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూరీ ఓ ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా గంటల తరబడి ఛాట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు.

అలాంటిదేమీ లేదన్న పూరీ జగన్నాథ్... సిమ్ చూపించి, ఛాట్ వివరాలు చూపించే సరికి తప్పు అంగీకరించినట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి పూరీ జగన్నాథ్ కెల్విన్ తో గంటల తరబడి చాట్ చేశాడు. ఆ సిమ్ ద్వారా గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్టు, దాని ద్వారా డ్రగ్స్ అమ్మకాలు సాగించినట్టు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ దందా మొత్తం బట్టబయలైనట్టు సమాచారం. అయితే విదేశాల నుంచి వచ్చే పార్సిల్స్ ను పూరీకి అందించానే తప్ప, అందులో ఏముందో కూడా తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు డ్రగ్ పెడ్లర్ శ్యామ్ కే నాయుడు చివరకు విచారణలో అసలు నిజాలను ఒప్పేసుకున్నాడని అంటున్నారు. మరోవైపు సిట్ విచారణకు కొనసాగింపుగా మూడోరోజు సుబ్బరాజును అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ దందా పేరుతో తన తండ్రిని బద్నాం చేస్తున్నారంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమార్తె ఇన్ స్టా గ్రాం ఖాతా ద్వారా చెప్పిన నీతులు ఉత్తవేనని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shyam K Naidu  Puri Jagannadh  International SIM  

Other Articles