PK New Movie Climax Follows Hit Formula

Pawan new movie climax as emotional drama

Pawan kalyan 25th Movie, PK 25, PK 25 Movie, PK Trivikram Climax, PK 25th Climax, PK 25 AD Similarities, Attarintiki Daredi Climax PK 25, AD Movie Climax PK 25, PK 25th Fight Scene

Pawan once again with Emotional Climax. Trivikram has penned a climax similar to that of AD for his current film starring Pawan Kalyan. It will feature a high octane action sequence followed by an elaborate emotional ending involving Pawan and principle cast of the film.

పీకే 25 సేమ్ అత్తారింటికి లాగానే...

Posted: 07/04/2017 03:34 PM IST
Pawan new movie climax as emotional drama

ఒక హీరో.. సింగిల్ హ్యాండ్ తో వంద మందిని నరికేయటం.. విలన్ ను చంపేయటం.. కథ సుఖాంతం అవ్వటం తెలుగు సినిమా ఇలాంటి క్లైమాక్స్ కు దూరమై చాలా రోజులే అయ్యింది. ప్రేమ కథలను ఒకలాంటి ముగింపు ఇస్తుంటే.. ప్రయోగాత్మక సిినిమాలకు మరోరకమైంది ఇస్తున్నారు. ఇక కమర్షియల్ సినిమాలకు కూడా అల్లు అర్జున్ లాంటి వాళ్లు హిల్లేరియస్ క్లైమాక్స్ ముగింపు ఇవ్వటం మొదలుపెట్టేశారు. అయినప్పటికీ తాము మాత్రం హింసా ప్రవృత్తితోనే ఎండ్ కార్డు వేసేస్తామంటున్నారు మరి కొందరు. కానీ, పవర్ స్టార్ మాత్రం తన హిట్ ఫార్ములాను ఇప్పుడు ఫాలో అయిపోతున్నాడు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డైరక్షన్ లో 25వ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ ముందు వచ్చే ఓ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా ముగింపు మాత్రం ఫైట్ తో కాకుండా ఓ ఎమోషనల్ సీక్వెన్స్ తో ఫ్లాన్ చేశాడంట మాటల మాంత్రికుడు. గతంలో అత్తారింటికి దారేది లో క్లైమాక్స్ ఎలా అయితే హైలెట్ అయ్యిందో.. ఇప్పుడు ఇది కూడా అలాగే వర్కవుట్ అవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ తో ఉంది.

ప్రధాన తారగణం మీద వచ్చే ఈ సన్నివేశం, పవన్ ఫెర్ ఫార్మెన్స్, దానికి తగ్గట్లు త్రివిక్రమ్ డైలాగులో ఓ రేంజ్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది. చూస్తుంటే అత్తారింటికి లాగానే.. మరో క్లాసీ అటెంప్ట్ తో ఈ క్రేజీ కాంబో మన ముందుకు రాబోతున్నట్లు అర్థమౌతోంది. కీర్తి సురేష్, అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  25th Movie  Trivikram Srinivas  AD Climax  

Other Articles