Copyright Case Srimanthudu Must to appear in court

Court again summons mahesh babu

Mahesh Babu, Mahesh Copyright Case, Srimanthudu Copyright Case , Mahesh Ignore Court Warning, Copyright Case Mahesh, Mahesh Babu Nampally Court, Mahesh Babu Court Case, Mahesh Babu Laws, Mahesh Movie Court, Mahesh Movie Sharat Chandra, Srimanthudu Chacchentha Prema, Mahesh Again Summons

Mahesh Babu to appear in Nampally court over Srimanthudu movie Copyright Case. But Due to absent court again issued Summons on August 7th.

కాపీ కేసు: మహేష్ కోర్టుకు రావాల్సిందే!

Posted: 06/28/2017 08:33 AM IST
Court again summons mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు మళ్లీ కోర్టు సమన్లు జారీ అయ్యాయి. శ్రీమంతుడు వివాదంలో నాంపల్లి కోర్టుకు మహేష్ మంగళవారం హాజరు కావాల్సి ఉంది. కారణం తెలీదుగానీ రాలేకపోయాడు. అయితే తన తరువాతి చిత్రం భరత్ అను నేను షూటింగ్ లో పాల్గొంటున్నట్లు మాత్రం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 2015 లో విడుదలైన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ కొట్టి ఈ సినిమా నిర్మించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయడంతో విచారణ కొనసాగుతూ వస్తోంది. వివాదానికి సంబంధించిన కేసులో సినీ నటుడు మహేశ్ బాబుకు, నిర్మాత ఎర్నేని శివకు నాంపల్లి కోర్టు మరోమారు సమన్లు జారీ చేసింది.

ఎంబీ క్రియేషన్స్ తరపున గిరిధర్ అనే వ్యక్తి హాజరవుతారంటూ ఆ సంస్థ డైరెక్టర్ నమ్రత కోరడంపై శరత్ చంద్ర తరపు న్యాయవాది శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఓ దశలో మహేశ్ కోర్టుకు హాజరవుతారని అంతా భావించారు. పోలీసులు కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. కానీ, అలా జరగకపోవటంతో కోర్టు మళ్లీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న విచారణకు ఖచ్ఛితంగా హాజరు కావాలని ఆదేశించింది. కాగా, శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివకు హైకోర్టు ఇచ్చిన మినహాయింపు ఉత్తర్వుల్లో సాంకేతిక లోపాలు ఉండటంతో ఆ స్టేను న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Mahesh Babum Nampally court  Summons  

Other Articles