Jai Anjali Balloon Movie Teaser Review

Jai balloon teaser released

Balloon Movie, Balloon Movie Teaser, Balloon Movie Anjali Jai, Jai Anjali Horror Drama, Balloon Teaser Review, Baloon Movie Teaser

Kollywood Love Pair come back with Horror Thriller. Jai, Anjali starrer Balloon Movie Trailer Out.

జర్నీ జంట.. ఇలాంటి సినిమానా?

Posted: 06/20/2017 02:17 PM IST
Jai balloon teaser released

కోలీవుడ్ లో ప్రేమ జర్నీ సాగిస్తున్న జంటగా జై, అంజలి మధ్య మధ్యలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సూర్య దోశె ఛాలెంజ్ పుణ్యమాని బయటపడ్డ వీళ్ల అఫైర్ తర్వాత మొన్న పుట్టినరోజు గ్రీటింగ్స్ తో కన్ఫర్మ్ అయిపోయింది. ఇది చాలదన్నట్లు అల్రెడీ వీళ్ల పెళ్లయిపోయిందన్న రూమర్ కూడా ఒకటి ఉంది. కానీ, అవేం పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తోంది ఈ లవ్లీ కపుల్.

ఇదిలా ఉంటే వీళ్లిద్దరూ కలిసి కోలీవుడ్ లో ఓ చిత్రంలో ఇప్పుడు జంటగా నటిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన బెలూన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. సినీశ్ అనే కొత్త కుర్రాడు డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఓ బెలూన్లు అమ్మే వ్యక్తి కొన్నేళ్ల క్రితం తన ప్రేయసిని, చంపి తాను చనిపోవటం. దాని వెనక ఉన్న మిస్టరీ, మధ్యలో హర్రర్ ఇంగ్లీష్ సినిమా తరహాలో పిల్లలతో భయపెట్టడం . అంజలి, జైల రొమాన్స్, చివర్లో హీరోయిజం ఇలా.. చాలానే చూపించారు.

 

గత కొంత కాలంగా జై కు సరైన హిట్ లేకుండా పోయింది. అంజలి ఏమో సినిమాలు చేయటం క్రమంగా తగ్గించేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిట్ వీరికి చాలా అవసరంగా మారింది. ఆగష్టులో బెలూన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Jai  Anjali  Balloon Movie  

Other Articles