Hot Discussion on Bunny's Insha Allah Comments

Allu arjun says insha allah in filmfare awards

Allu Arjun Insha Allah, Allu Arjun Jio Fimfare Awards, Allu Arjun 2017 Filmfare, Allu Arjun Comments, Bunny Insha Allah, 2017 South Fimfare Awards

Allu Arjun Sensational Comments At Jio Filmfare Awards. Allu Sirish stated that hero Vijay Devarakonda is wishing that he will get next year Filmfare Best Actor Award, Bunny said, "Hopefully, Insha Allah".

ఫిల్మ్ ఫేర్ లో బన్నీ మరో హాట్ కామెంట్

Posted: 06/20/2017 11:00 AM IST
Allu arjun says insha allah in filmfare awards

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీచ్ కోసం ఈ మధ్య జనాలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడయితే చెప్పను బ్రదర్ అంటూ ఓ సింగిల్ డైలాగ్ తో ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కున్నాడో.. అప్పటి నుంచి ప్రతి స్టేజీ మీద అతని నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయా? అని ఎదురు చూడటం అలవాటుగా మారిపోయింది.

రీసెంట్ గా జియో ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో కూడా ‘‘ఇన్సా అల్లా’’ అంటూ చేసిన కామెంట్లపై ఇప్పుడు రచ్చ మొదలైంది. శనివారం రాత్రి గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకు పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ హోస్ట్ లుగా వ్వయహరించారు. బెస్ట్ హీరోగా క్రిటిక్స్ విభాగంలో ప్రకాశ్ రాజ్ చేతుల మీదుగా బన్నీ అవార్డును అందుకున్నాడు. అప్పుడు శిరీష్ కలగజేసుకుని.. ''వచ్చే సంవత్సరం వీడు (విజయ్) తనకు ఆ అవార్డు రావాలని అనుకుంటున్నాడు'' అనగానే.. దానికి బన్నీ... 'హోప్ ఫుల్లీ.. ఇన్షా అల్లా' అన్నాడు. అంటే అక్కడున్న
వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

అసలు ఇలాంటి మతపరమైన కామెంట్స్ ఎందుకు చేశాడా? అంటూ చర్చ మొదలుపెట్టారు. మాములుగా స్టేజీ పై బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఈ పదాన్ని చాలా సార్లు ఉపయోగించాడు. కానీ, హిందూ అయిన బన్నీ అతన్ని ఇమిటేట్ చేశాడా? లేక మాములుగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా? అన్న డిస్కషన్ జరుగుతుండగానే.. దేవుడు నీకు సాయం చేస్తాడు(అరబిక్ లో ఇన్షా అల్లా) అన్న పదాన్ని కాజువల్ గా వాడటానికి ఏ మతం అయితే ఏంటని.. ఇదంతా చెత్త డిస్కషన్ అంటూ కొట్టిపడేస్తున్నారు కొందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Insha Allah  Filmfare Awards 2017  

Other Articles