Regina Cassandra Carrier Almost Closed

No movie offers for regina in south

Regina Cassandra, Regina Tollywood Carrier, Regina Movies, Actress Regina Movies, Regina 2017 Movies, Regina Cassandra, No Offers For Regina, Regina Carrier End

No More Tollywood Movies for Regina Cassandra. Already Nakshatrama and Nenjam Marappathillai(Tamil) Not Yet Released.

రెజీనా నో సినిమాలు.. ఇక మూసుకోవాల్సిందేనా?

Posted: 06/12/2017 06:47 PM IST
No movie offers for regina in south

తెలుగుపై కాస్త నెగటివ్ కామెంట్లు చేసి తమిళ్ కు మళ్లిన రెజీనాకు అక్కడ నిరాశే ఎదురవుతూ వస్తోంది. నగరం తమిళ్ వర్షన్ ఏదో కంటెంట్ తో అక్కడ అంతంత మాత్రంగా ఆడగా, ఉదయ్ నిధి స్టాలిన్ తో చేసిన సినిమా డిజాస్టర్ గా మారింది. దీంతో కోలీవుడ్ మేకర్లు ఈ డస్కీ వైపు చూడాలంటేనే వణికి పోతున్నారు.

సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రెజీకి రెండు సినిమాలు డిలే కావటం మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఒకటి తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రావాల్సిన 'నక్షత్రం' కాగా, ఇంకోటి ఎస్ జే సూర్య తో నటించిన 'నెంజమ్ మరపతిల్లై' . డిఫరెంట్ చిత్రాల దర్వకుడు సెల్వ రాఘవన్ డైరక్షన్ ఆ సినిమా దాదాపు ఓ ఆరు నెలల క్రితమే రిలీజ్ కావాల్సి ఉంది. హర్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ చిత్రంలో మంచి రోల్ పడిందని రెజీనా చాలా సార్లు చెప్పుకొచ్చింది కూడా. అయితే కారణాలేంటో తెలీదుగానీ ఇప్పటిదాకా వాయిదా పడుతూ వస్తోంది. ఇక నక్షత్రం పరిస్థితి కూడా అంతే. షూటింగ్ ముగిసినా ఎలాంటి అప్ డేట్ లేకుండా పోతుంది.

ఇవేగాక బాలీవుడ్ లో అమితాబ్ తో ఆంఖే -2 లో కూడా నటిస్తోంది. కెరీర్ సక్రమంగా సాగాలంటే ఖచ్ఛితంగా ఒకటో రెండో హిట్లు పడి తీరాలు. అలా హిట్ టాక్ వస్తేనే మరికొన్ని ఛాన్సులు వచ్చేది. లేకుంటే రెజీనాకు ఐటెం సాంగ్ లో, లేక గెస్ట్ రోల్సో గతి పట్టడం ఖాయమనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Regina Cassandra  Tollywood  Kollywood  No Movies  

Other Articles