Sampath Nandi again Test his Luck as Producer

Racha director second attempt as producer

Sampath Nandi, Sampath Nandi Sukumar, Sampath Nandi Creative Works, Sampath Nandi Movies, Sampath Nandi Producer, Sukumar Sampath Nandi, Paper Boy Movie, Paper Boy Telugu Movie, Sampath Nandi Second Producing Movie

Director Sampath Nandi maiden attempt as a producer was a failure. Aadi-starrer 'Galipatam' (2014) as his maiden venture. The film had story, screenplay and dialogues penned by Nandi himself. The bold themed film however tanked at box office. Three years later, Sampath Nandi is all set to bankroll another film. Tilted 'Paper Boy', this film is also penned by Sampath himself. His assistant Jaya Shankar will make his directorial debut, Santosh Shoban and debutante Aishwarya Vhatkar in lead roles.

రచ్చ డైరక్టర్.. సెకండ అటెంప్ట్ లో సక్సెస్ అవుతాడా?

Posted: 06/08/2017 11:32 AM IST
Racha director second attempt as producer

ఏమైంది ఈవేళ లాంటి చిన్న సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన దర్శకుడు సంపత్ నంది తర్వాత రామ్ చరణ్ తో రచ్చ చేసి పడేశాడు. పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ మిస్సయినప్పటికీ రవితేజతో బెంగాల్ టైగర్ లాంటి మాస్ హిట్ తో హ్యాట్రిక్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. అదే ఊపులో ఇప్పుడు ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కు హిట్ ఇచ్చేందుకు గౌతమ్ నందను రెడీ చేస్తున్నాడు.

అయితే దర్శకుడిగా వరుస సక్సెస్ లు చవిచూస్తున్న సంపత్ నిర్మాతగా మాత్రం ఘోరంగా ఫెలయ్యాడు. ఇంతకు ముందు ఆది హీరోగా ‘గాలిపటం’అనే ఓ చిత్రాన్ని నిర్మించి, స్టోరీ కూడా అందించాడు. బోల్డ్ కంటెంట్, లివింగ్ రిలేషన్ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయినప్పటికీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

‘పేపర్ బోయ్’ అనే ఓ చిత్రాన్ని తన బ్యానర్ సంపత్ క్రియేటివ్ వర్క్స్ పై నిర్మిస్తూ కథ, మాటలు అందిస్తున్నాడు ఈ మాస్ డైరక్టర్. తన దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసిన జయ శంకర్ అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. సంతోష్ శోభన్, ఐశ్వర్య అనే కొత్త వాళ్లను ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి తీసుకురాబోతున్నాడు. మరి ఈసారైనా లక్ సంపత్ కు కలిసొచ్చి సుకుమార్ లా జాక్ పాట్ కొడతాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Producer  Sampath Nandi  Paper Boy Movie  

Other Articles