NTR Hurt With Bigg Boss Show Remuneration Rumours

Ntr unhappy with big boss show issue

Junior NTR, NTR Bigg Boss Show, Big Boss Show Remuneration, Junior NTR Hurt, Junior NTR Rumour, Big Boss SHow Telugu Rumour, NTR Remuneration Rumour, NTR Big Boss Remuneration, Critics on Junior NTR, NTR Chiranjeevi Remuneration

Junior NTR Hurt With Bigg Boss Show Remuneration Rumours. News Circulated that Young Tiger take remuneration more than chiranjeevi. Besides this Rana Ready for another TV Show.

బిగ్ న్యూస్.. ఎన్టీఆర్ హర్టయ్యాడు

Posted: 06/01/2017 03:20 PM IST
Ntr unhappy with big boss show issue

ఎన్టీఆర్ ఎప్పుడూ తన సినిమాలకి సంబంధించిన కథా కథనాలపైనే తప్ప మిగతా విషయాల్లో కలగజేసుకోడనే టాక ఉంది. పైగా పారితోషికం గురించి అస్సలు పట్టించుకోడనే చెప్పుకుంటుంటారు. ఫలానా సినిమాకి అంతా తీసుకుంటున్నాడు .. ఇంత అందుకుంటున్నాడనే వార్తలు కూడా ఎక్కడా వినిపించవు. అలాంటిది బుల్లితెరకి సంబంధించి ఆయన భారీ పారితోషికం తీసుకోనున్నాడనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.

హిందీలో పాప్యులర్ అయిన 'బిగ్ బాస్' తెలుగు వెర్షన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇందుకోసం పారితోషికంగా ఎన్టీఆర్ కి భారీ మొత్తం(8 కోట్లు అని టాక్) అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అనవసరమైన ఈ హైప్ కారణంగా తన క్లీన్ ఇమేజ్ కి నష్టం జరుగుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. తాను డబ్బు మనిషిని అన్నట్టుగా జరుగుతోన్న ఈ ప్రచారం, తనకి చాలా బాధ కలిగించిందనేది సన్నిహితులు చెబుతోన్న మాట.

ఇక రానా కూడా బుల్లితెర డెబ్యూకి రెడీ అయిపోతున్నాడు. మూవీ సెలబ్రిటీల పర్సనల్ డేటాకు సంబంధించి ఓ షోకి హోస్ట్ గా చేయబోతున్నాడు. ఈ ఇద్దరి ఎంట్రీ వెనకాల చిరు, నాగ్ హస్తం ఉందనేది సినీ ట్రేడ్ వర్గాల వాదన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Big Boss Show  Junior NTR  Remuneration Rumour  

Other Articles