Dangal Inch Close to cross Baahubali 2 Collections

Baahubali 2 versus dangal fight

Dangal Baahubali 2, angal Highest Grosser, Baahubali 2 China, Why China Interested Dangal, Dangal Cross Baahubali 2, Baahubali 2 Big Fight Dangal, Dangal Versus Baahubali 2

Dangal again in battle with Baahubali The Conclusion. Both Movies touched 1500 Crores mark. Let see who will final winner in this race.

దంగల్ వర్సెస్ బాహుబలి-2 .. గెలుపెవరిది?

Posted: 05/23/2017 04:46 PM IST
Baahubali 2 versus dangal fight

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'దంగల్' సినిమా దుమ్ము దులుపుతోంది. ఆరు నెలల క్రితం అప్పటివరకు వున్న భారతీయ చిత్రపరిశ్రమ రికార్డులన్నిటినీ తుడిచిపెట్టిన 'దంగల్'.. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా ఎంటర్ కావడంతో వెనుకపడింది. తెలుగు సినీ ప్రతిష్ఠను పెంచుతూ 1500 కోట్ల క్లబ్ లో చేరిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది.

అయితే 'దంగల్' భారత్ లో 744 కోట్ల రూపాయలు వసూలు చేయగా...'బాహుబలి-2: ద కన్ క్లూజన్' 1500 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మే 5న చైనాలో విడుదలైన 'దంగల్' ను మళ్లీ రీలీజ్ చేయగా ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. కేవలం 17 రోజుల్లో 'దంగల్' చైనాలో 740 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా మళ్లీ రేసులోకి వచ్చింది. భారత్ చైనాల్లో కలిపి దంగల్ 1501 కోట్లు వసూలు చేయగా, 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా 1538 కోట్ల వసూళ్లు సాధించింది. చైనాలో అద్భుత విజయం సాధించిన దంగల్ 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' వసూళ్లను దాటడం మరో రెండు రోజల పని అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇక చైనీయులకు గ్రాఫిక్ సినిమాలు పెద్ద విశేషం కాదు. మార్షల్ ఆర్ట్స్ అన్నా, క్రీడలన్నా ఇష్టం. అందుకే 'దంగల్' కి ఇందుకే ఇంతగా రెస్పాన్స్ వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే గ్రాఫిక్స్ ప్రధానాంశంగా ఉన్న బాహుబలి మొదటిపార్ట్ కు అక్కడ చుక్కెదురైంది. దీంతో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' అక్కడ దంగల్ తో అసలు పోటీ పడగలుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  Dangal  Baahubali 2  Overall Collections  

Other Articles