Gopi Chand Aaradugula Bullet Trailer Out

Aaradugula bullet trailer released

Gopichand, Aaradugula Bullet Trailer, Aaradugula Bullet Nayanthara, Gopichand Aaradugula Bullet, Aaradugula Bullet Trailer, Gopichand New Movie Trailer, Aaradugula Bullet Trailer Talk, Gopichand New Movie Trailer

Gopichand and Nayanthara starring Aaradugula Bullet movie theatrical trailer is out today.This Film in the direction of veteran filmmaker B Gopal.

అరడుగుల బుల్లెట్ ట్రైలర్ విడుదల

Posted: 05/05/2017 06:06 PM IST
Aaradugula bullet trailer released

యాక్షన్ హీరో గోపిచంద్ సినిమా చాలా గ్యాప్ తర్వాత వరుసగా మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలోని గౌతమ్ నంద సంగతి పక్కన పెడితే మిగతా రెండు చిత్రాలు మాత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. అందులో ఒకటి ఆక్సిజన్, మరోకటి సీనియర్ దర్శకుడు బీ గోపాల్ దర్శకత్వంలో రాబోతున్న ఆరడుగుల బుల్లెట్.

ఇందులో ముందుగా ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర నిర్మాతలు. కామెడీ ఫ్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కించినట్లు అర్థమౌతోంది. తండ్రి కొడుకులుగా ప్రకాశ్ రాజ్, గోపీచంద్ ల కామెడీ బాగానే ఉంది. అయితే యాక్షన్ సీక్వెన్స్ మరీ కామన్ గా ఉండటం, పైగా సినిమా షూటింగ్ మధ్య మధ్యలో ఆగిజరుపుకోవటం మూలానో ఏమో గోపీచంద్ గెటప్ లో చాలా వేరియన్లు కనిపిస్తున్నాయి. నయనతార గెటప్ కూడా చాలా ఓల్డ్ గా ఉంది.  బ్రహ్మీ దీఫక్ రాజ్ కామెడీ కూడా కిక్ సినిమాను గుర్తు చేసింది.

 

విలన్లుగా అభిమన్యు సింగ్, ఘర్షణ ఫేం పండా లు నటిస్తున్నారు. రిక్టర్ స్కేలు పగిలిపొద్ది లాంటి మాస్ డైలాగులు ఉన్నాయి. మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సమ్మర్ లోనే ఆరడుగుల బుల్లెట్ ను ప్రేక్షకుల ముందు తెచ్చే యత్నం చేస్తున్నారు. అవుట్ డేటెడ్ ఫార్ములాగా కనిపిస్తున్న ఈ సినిమా గోపికి హిట్ అందిస్తుందో లేదో?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Aaradugula Bullet  Movie Trailer  

Other Articles