Rajamouli says no to Tamanna Scenes in Baahubali 2

Tamanna scenes deleted in baahubali 2

Baahubali 2, Baahubali 2 Tamanna Portion, Baahubali 2 Tamanna Scenes, Tamanna Scenes Deleted, Baahubali 2 Deleted Scenes, Baahubali 2 Tamanna, Tamanna Scenes Rajamouli, Rajamouli Unsatisfied Tamanna, Tamanna, Baahubali 2 Editing, Baahubali 2 Uncensored Scenes, Tamanna Upset Baahubali 2 Success

Tamanna's Scenes Chopped by Rajamouli Mercilessly in Baahubali 2 Editing. Unsatisfied with the visual effects output, Rajamouli has decided to cut those scenes away from the film.

తమన్నా సీన్లను ఎడిటింగ్ లో లేపేశారు

Posted: 05/06/2017 08:18 AM IST
Tamanna scenes deleted in baahubali 2

బాహుబలి ది కంక్లూజన్ భారీ సక్సెస్ తో తెలుగు ఇండస్ట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. ఐదేళ్లుగా తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కటంతో జక్కన్న టీం కూడా వరుసగా పార్టీలతో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో నటించిన నటీనటులకు, చివరకు టెక్నీషియన్స్ కు కూడా ఫ్యూచర్ లో వేరే సినిమాలకు పని చేసేందుకు రిఫరెన్స్ గా బాహుబలిని చూపించుకునే ఛాన్స్ దొరికింది. అయితే ఓవరాల్ గా సినిమాతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది మాత్రం ఒక్క తమన్నాకే అనుకోవాలి.

మొదటి పార్ట్ లో గ్లామర్ పరంగా వాడుకున్న రాజమౌళి రెండో పార్ట్ లో జస్ట్ నిమిషంన్నర రోల్ తో సరిపెట్టాడు. క్లైమాక్స్ లో కూడా తన రోలే కీలకం అని చెప్పటంతో ఏదో ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాడని రిలీజ్ కు మందు అంతా అంతా అనుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇదే చిత్రంలో నటించిన మరో జూనియర్ ఆర్టిస్ట్ మహిళను చూపిస్తూ మిల్కీ కన్నా ఆమె ఎక్కువ సీన్లలో కనిపించిందంటూ కొందరు సెటైర్లు కూడా వేశారు. అసలు బాహుబలి కోసమే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం అంటూ తెగ కష్టపడ్డ తమన్నాకి రాజన్న ఎందుకింత ద్రోహం చేశాడు?

నిజానికి సినిమాలో తమన్నా పోర్షన్ చాలా ఎక్కువే ఉంటుందంట. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా పూర్ అవుట్ పుట్ రావటంతో సంతృప్తి చెందని రాజమౌళి ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను లేపేసినట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. తమన్నా, అనుష్క, ప్రభాస్ ల మధ్యే ఎక్కువగా ఈ పోర్షన్ ఉందంట. ఓవరాల్ గా ఎడిటింగ్ లో పనిగట్టుకుని మరీ తమ్మూకి సంబంధించిన సీన్లే తీసేయటం, ప్రమోషన్లకు చాలా దూరం పెట్టడం మాత్రం వాళ్ల మధ్య ఏదో జరిగిందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  Tamanna  Baahubali 2  Edited Scenes  

Other Articles