Malayalam Actress Wins Half kg Gold in Draw

Malayalam film actress won gold in raffle

Aima Rosmy Sebastian, Aima Rosmy Gold, Actress Won Draw, Dubai Lucky Draw Actress, Mallu Actress Won Gold, Dubai Aima Rosmy, Aima Rosmy Sebastian Movies, Aima Rosmy Sebastian Details, Actress Halgf KG Gold, Dubai Raffle Actress, Aima Rosmy Sebastian Malabar Gold

Malayalam Actress Aima Rosmy Sebastian wins half kg gold in Dubai raffle. Aima won a fortune of half kilogram gold in the Akshaya Tritiya raffle draw.

డ్రా లో అరకిలో బంగారం గెలుచుకున్న హీరోయిన్

Posted: 05/05/2017 12:26 PM IST
Malayalam film actress won gold in raffle

దుబాయ్ ఆ మళయాళం హీరోయిన్ కు బాగా కలిసొచ్చింది. పుట్టి నివసించేది(పెరిగింది మొత్తం) అక్కడే. తన మొదటి సినిమా ఫస్ట్ షాట్ తీసింది అక్కడే. ఇప్పుడు ఏకంగా అదృష్టాన్ని బంగారం రూపంలో అదించింది కూడా అక్కడే.

23 ఏళ్ల ఐమా రోస్మీ సెబాస్టియన్ క్లాసిక్ డాన్సర్ అయిన ఈ బ్యూటీ 25 ఏళ్లుగా దుబాయ్ లోనే ఉంటుంది. 2016 లో దూరం చిత్రం ద్వారా ఆరంగ్రేటం చేసింది. గత సంవత్సరం నివిన్ పౌల్ నటించిన 'జకాబ్నేట్ స్వర్గరాజ్యం' అనే సూపర్ హిట్ చిత్రంలో అమ్ము అనే రోల్ లో నటించింది. అక్షయ తృతీయ సందర్భంగా దుబాయ్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో షాపింగ్ చేసి తనకు, తన చెల్లెళ్లకు నగలు కొనుక్కుంది. లక్కీ డ్రాలో భాగంగా డ్రాప్ బాక్సులో వేయగా, నిన్న విజేతలను ఎంపిక చేశారు. అందులో 086330 నంబర్ గల కూపన్ కు జాక్ పాట్ దక్కింది. అది ఐమాదే కావటంతో ఏకంగా అరకిలో బంగారాన్ని ఆమె గెలుచుకుంది.

ఇక ఇంత అదృష్టం తనను వరిస్తుందని కలలో కూడా ఊహించలేదని ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ అందాల భామ, ప్రస్తుతం తాను సినిమాలతో పాటే, మణిపాల్ యూనివర్శిటీలో ఎంబీఏ చేస్తున్నానని చెబుతోంది. ఏ రంగంలోనైనా ఎంత టాలెంట్ ఉన్నా కూసింత అదృష్టం కూడా ఉంటేనే రాణిస్తారన్న సంగతి తెలిసిందే. కానీ, ఈ మల్లూ బ్యూటీ విషయంలో అది కాస్త ఎక్కువ డోసే ఉన్నట్లు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malayalam Actress  Aima Rosmy Sebastian  Half KG Gold  

Other Articles