Rajamouli lifts Marco Polo Scene in Baahubali 2

Baahubali 2 scene copied from hollywood

Baahubali 2, Baahubali 2 Hollywood Copy, Marco Polo Horse Scene, Marco Polo Baahubali 2, Marco Polo Scene Copy, Baahuabli 2 American TV Show, Rajamouli Copy Hollywood Scenes, Baahubali Save Kuntala Rajyam, Marco Polo Season 2 Baahubali 2, Baahubali 2 Copy Paste

Baahubali 2 Ox Fire Scene Copied from American Television Show Marco Polo Season 2. However, this is not first-time, Rajamouli is facing such accusations. Many scenes from his films, including Baahubali 1 & Baahubali 2.

బాహుబలి-2 .. ఆ సీన్ హాలీవుడ్ కాపీయేనా?

Posted: 05/04/2017 09:57 AM IST
Baahubali 2 scene copied from hollywood

కాపీ రాయుళ్ల వేట మళ్లీ మొదలైంది. ఒక సినిమా హిట్ అయితే చాలూ అందులోని ఇంచు ఇంచును స్కాన్ చేసి మరీ పోస్టులు పెట్టడం బాగా అలవాటు అయిపోయింది. ఇంతకు ముందు బాహుబలి ఫస్ట్ పార్ట్ విషయంలో నీళ్లలో శివగామి చిన్నారిని ఎత్తుకునే సీన్ దగ్గరి నుంచి.. స్టోరీ చైనా సినిమా కాపీ అని కొందరు, ఇంకొందరైతే వార్ సీన్ లోని అమరేంద్రుడి ఆయిల్ క్లాత్ తో కాళకేయులను చంపే సన్నివేశం ఓ వీడియో గేమ్ నుంచి దించేశారని ఇలా కామెంట్లు చేసిన వాళ్లు ఉన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు బాహుబలి 2 విషయంలో కూడా జరుగుతోంది.

రెండో పార్ట్ ఫస్ట్ లుక్ సమయంలో హాలీవుడ్ మూవీ నుంచి కాపీ అంటూ మొదలుపెట్టి క్లైమాక్స్ లో తాటిచెట్లతో కోటలోకి ప్రవేశించే సీన్ ను యాంగ్రీ బర్డ్ గేమ్ తో కంపేర్ చేసేశారు కొందరు. ఇక ఇప్పుడు సినిమాలోని ఓ సీన్ ను హాలీవుడ్ కాపీ అంటూ తేల్చేవారు. అమెరికన్ టీవీ షో మార్కోపోలో లో ఓ సీన్ ను రాజమౌళి కాపీ చేశాడన్నదే వారి ఆరోపణ. ఇందులో ఓ సీన్ లో శత్రువులను చెదరగొట్టడానికి గుర్రాలకు నిప్పంటించి వారి స్థావరాల్లోకి వదులుతారు హీరో అండ్ టీం. సేమ్ టూ సేమ్ బాహుబలి 2 లో కుంతల రాజ్యాన్ని కాపాడే క్రమంలో ఆవుల కొమ్ములకు నిప్పంటించి వదులుతారు.

 

నెట్ ఫ్లిక్స్ సంస్థ రూపొందించిన 10 ఎపిసోడ్ల మార్కోపోలో సిరీస్ నుంచే జక్కన్న దించేశాడని చెబుతున్నారు. అయితే ఈ పద్ధతిని ఇండియాలో పూర్వం రాజులు వినియోగించేవారన్న విషయం బహుశా వారికి తెలీకపోయి ఉండొచ్చు. చరిత్రను తిరగేస్తే ఆ వంకలు పెట్టేవారికి ప్రూఫ్ లు దొరుకుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Baahubali 2  Hollywood Copy  

Other Articles