Mohan Babu Tweets on Prabhas Marriage

Mohan babu tweets on prabhas marriage

Mohan Babu Prabhas, Mohan Babu Baahubali Bava, Baahubali Bava, Baahubali Prabhas Marriage, Prabhas Marriage, Tweets Prabhas Marriage, Mohan Babu Prabhas Marriage, Mohan Babu Baahubali 2, Mohan Babu Rajamouli

Actor Mohan Babu praised Baahubaki team in Twitter, Special Tweets About Prabhas Marriage.

ప్రభాస్ పెళ్లిపై మోహన్ బాబు ట్వీట్లు

Posted: 05/04/2017 08:44 AM IST
Mohan babu tweets on prabhas marriage

బాహుబలి-2’పై పలువురు సినీ ప్రముఖులు సహా రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సీనియర్ నటుడు మోహన్ బాబు తన దైన శైలిలో ప్రశంసించారు. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కథా రచయిత విజయేంద్రప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి శ్రీవల్లి, నటులు రానా, ప్రభాస్ పై ఆయన ప్రశంసలు కురిపించాడు.

'దేశంలో తెలుగు ప్రజల ఖ్యాతి ఎన్టీఆర్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. టాలీవుడ్ లో ఓ గొప్ప దర్శకుడు ఉన్నాడని నీ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పావ్' అంటూ రాజమౌళిని ప్రశంసించిన మోహన్ బాబు.. ఇక ప్రభాస్ విషయంలో మాత్రం కాసింత డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. 'బావా బాహుబలి..పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే 'రాజులు' పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ' అంటూ ట్వీట్ చేశాడు మోహన్ బాబు.

గతంలో వీరిద్దరు కలిసి బుజ్జిగాడు సినిమాలో బావ బామర్దులుగా నటించిన విషయం తెలిసిందే. ఆ మధ్య మనోజ్ పెళ్లికి ఆలస్యంగా వచ్చిన ప్రభాస్ పై మోహన్ బాబు అలిగితే ఆలింగంనం చేసుకుని సముదాయించిన విషయం కూడా గుర్తే ఉండి ఉంటుంది. ఆ చనువతోనే ఇప్పుడు ఇలా బావ.. కోరిక తీర్చంటూ ట్వీట్ ఏశాడు కలెక్షన్ కింగ్.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  Prabhas Marrage  Baahubali Tweets  

Other Articles