Bcom Physics line in Mahesh Spyder Movie

Mahesh spyder using jaleel khan craze

Jaleel Khan, Mahesh Babu, Jaleel Khan Mahesh Babu, Mahesh Babu Spyder Movie Songs, Jaleel Khan Spyder Lyrics, Social Media Hero Jaleel Khan, Funny Statement for Mahesh babu Song, Spyder Movie Jaleel Khan, Bcom Physics Mahesh Babu, Bcom Physics Song, Bcom Physics Lines Spyder

TDP MLA Jaleel Khan Funny Statement i.e. Bcom Physics lines to Mahesh Babu. lyricist Ramajogayya Sastri movie ad this line in a Song for Spyder .

బీ.కాంలో ఫిజిక్స్.. మహేష్ మూవీలో కూడానా?

Posted: 05/03/2017 11:37 AM IST
Mahesh spyder using jaleel khan craze

సోషల్ మీడియాలో ట్రోల్స్ తో కూడా ఈజీగా హీరో కావొచ్చన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. తెలుగు జనాలకు ఈయనగారి బీకాంలో ఫిజిక్స్ వ్యవహారం ఎలా కనెక్ట్ అయ్యిందంటే బుల్లితెరలో కూడా కామెడీ పంచ్ ల కోసం వాడుకునేంతగా.. ‘ఉంటది ఎందుకు ఉండదు. ఉంటది’ అంటూ ఆయన మాటలు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడో దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటున్నాయి. దెబ్బకు సోషల్ మీడియాలో ఈ బెజవాడ ఎమ్మెల్యే పెద్ద హీరో అయిపోయాడు కూడా.

ఇక ఈ హీరోగారి స్టేట్ మెంట్ ను ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్లు వాడేసుకుంటున్నారు. ఇంట్రస్ట్రింగ్ న్యూస్ ఏంటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇందుకు మినహాయింపు కావట్లేదన్న సమాచారం బయటికి పొక్కింది. ఇంతకీ బీకాంలో ఫిజిక్స్ ను మహేష్ ఎలా వాడబోతున్నాడనేగా మీ డౌట్. దానికి సమాధానం స్పైడర్ పాటలో ఉంటుందంట. ''బీకాంలో ఫిజిక్స్ ఉండొచ్చేమో కాని.. నీ సోకుల కొలతల్లో తేడాలు ఉండవ్'' అంటూ ఓ లైన్ ను రాశాడంట రచయిత రామజోగయ్య శాస్ర్తి.

జలీల్ ఖాన్ స్ఫూర్తితోనే పవన్ అలా...

 

అలా స్పైడర్ సాంగ్ లో జలీల్ ఖాన్ మాటల్ని ఇరికించేయబోతున్నారని టాక్. అయితే ఆ లైన్ ను ఉంచాలా వద్దా అనే తుది నిర్ణయం మాత్రం మహేష్ కే వదిలేశారంట మేకర్లు. ఒకవేళ అదే జరిగితే మాత్రం బీకాం ఫిజిక్స్ కొన్నాళ్ల పాటు కనుమరుగు అయిపోకుండా జనాల నోళ్లలో నానుతూనే ఉంటుందనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaleel Khan  Mahesh Babu  Spyder Movie Song  

Other Articles