Baahubali 2 Bollywood First Day Collections Deatils

Baahubali 2 bollywood version first day report

Baahubali 2, Baahubali 2 Hindi Day 1, baahubali 2 Bollywood Collections, Taran Adarsh Baahubali 2 Day 1 Collections, Baahubali 2 Dangal Sultan, Baahubali 2 Third Bollywood Opener, Baahubali The Conclusion Bollywood Records, Baahubali 2 First Day Collections

Big Surprise to Baahubali 2 on First Day Collections. Prabhas starer movie collects 36 crores only in Hindi version.

బాహుబలి-2 హిందీ ఫస్ట్ డే కలెక్షన్లు

Posted: 04/29/2017 10:47 AM IST
Baahubali 2 bollywood version first day report

ఊహించిందే జరిగింది. బాలీవుడ్ లో ఫస్ట్ డే బాహుబలి 2 సంచలనాలు మొదలైపోయాయి. అంచనాలను దాటేస్తూ మొదటి రోజే చిత్రం 36 కోట్లను వసూలు చేయటం విశేషం. అంతేకాదు తొలిరోజు కలెక్షన్లతో ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్లలో టాప్ -3 లో నిలిచింది. అంతకు ముందు ఈ లిస్ట్ లో 44 కోట్లతో హ్యాపీ న్యూఇయర్, సల్మాన్ ప్రేమ్ రతన్ థన్ పాయో 40.37 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.

బాలీవుడ్ లో ఇప్పటిదాకా దంగల్, సుల్తాన్ ఫస్ట్ డే కలెక్షన్లను బీట్ చేస్తుందన్న ఎక్స్ పెక్టేషన్లను రీచ్ అయ్యింది. మాములుగా బాలీవుడ్ లో ఖాన్ త్రయం చిత్రాలకు ఎక్కువ స్క్రీన్ లను కేటాయిస్తుంటారు. అయితే కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూటింగ్ కావటంతో దాదాపు అదే స్థాయిలో బాహుబలి 2 కి కూడా ఇచ్చేశారు.హ్యాపీ న్యూ ఇయర్, ప్రేమ్ రతన్ లు సెలవు రోజున రిలీజ్ అయి కలెక్షన్లు రాబట్టాయి. కానీ, బాహుబలి 2 మాత్రం వర్కింగ్ డే లోనే రిలీజ్ అయ్యింది.

మొత్తానికి రాజమౌళి వంటి వజ్రాన్ని గుర్తించిన కరణ్ జొహార్ తెలివి తేటలకు 'బాహుబలి'ని ఇష్టపడే భారతీయులు పాదాభివందనం చేయాలని వర్మ ట్వీట్ చేశాడు. ప్రపంచం బీసీ అండ్ ఏడీ (క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకం)లా భారత సినిమా ఇక 'బీబీ అండ్ ఏబీ' (బిఫోర్ బాహుబలి అండ్ ఆఫ్టర్ బాహుబలి)గా మారనుందని అభిప్రాయపడ్డాడు. బాలీవుడ్ లోని ప్రతి సూపర్ స్టార్, ప్రతి సూపర్ డైరెక్టర్ 'బాహుబలి 2' ప్రభంజనంతో వణికిపోతున్నారని అన్నాడు.

 

యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావటం, శని, ఆది వారాలతోపాటు మే డే సెలవు కూడా కలిసిరావటంతో బాహుబలి 2 మూడు రోజుల్లో వంద కోట్ల మార్క్ ను దాటిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Hindi Version  Day 1 Collections  

Other Articles