Rishi Kapoor slams young Actors for Vinod Khanna's funeral absent

Rishi kapoor slams young genetation actors

Rishi Kapoor, Rishi Kapoor Shameful Tweets, Rishi Kapoor Lashes Out, Rishi Kapoor Vinod Khanna Funeral, Actor Vinod Khanna Funeral, Rishi Kapoor Fire, Rishi Kapoor Angry

Rishi Kapoor lashes out Young Generation Bollywood actors who skipped away to Vinod Khanna's Funeral. Slam with Shameful tweets on those so called stars.

యంగ్ జనరేషన్ పై రిషికపూర్ ఫైర్

Posted: 04/28/2017 02:47 PM IST
Rishi kapoor slams young genetation actors

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ కు చిర్రెత్తుకొచ్చింది. తనకు సంబంధం ఉన్నా.. లేకపోయినా సరే... ఎలాంటి టాపిక్ లోనైనా సరే దూరిపోయి తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఆయనకు కొట్టిన పిండి. ఖుల్లం ఖుల్లా పేరుతో ఆయన చేసిన సంచలనాలు అంతా ఇంతా కాదు. అందుకే ఆయన్ని అదోరకం అని బాలీవుడ్ మీడియా పిలుస్తుంటుంది.

ప్రతీ విషయాన్ని పచ్చిగా మాట్లాడే ఈ పెద్దాయనకు మరోసారి కోపం వచ్చింది. ఎందుకంటారా? వెటరన్ నటుడు వినోద్ ఖన్నా గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే కదా. నిన్న సాయంత్రమే ఆయన అంత్యక్రియలు కూడా చేసేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటి తరం నటులెవరూ హాజరుకాకపోవటంపై రిషికి కోపం వచ్చింది. అంతే తన ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు కురిపించాడు. సిగ్గు చేటు ఓ లెజెండరీ నటుడు చనిపోతే ఒక్కరూ రాలేకపోయారు. చివరకు ఆయనతో నటించిన వాళ్లు కూడా. దిగ్గజ నటుడికి గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్నానం కూడా వాళ్లకు లేకపోయింది అంటూ ఓ సందేశం ఉంచాడు.

తన భార్య, కొడుకు రణ్ బీర్ లు విదేశాల్లో ఉండటం మూలంగా రాలేకపోయారని వివరణ ఇచ్చిన రిషి.. రేపు తాను చనిపోయాక కూడా పరిస్థితి ఇంతే ఉంటుందేమోనని, అందుకోసం మానసికంగా రెడీ అయి ఉండాలని ట్వీట్ లతోనే ఆవేదన వ్యక్తం చేశాడు. 70 ఏళ్ల వినోద్ ఖన్నా కాన్సర్ తో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన అంత్యక్రియలకు రిషితోపాటు అమితాబ్, అభిషేక్, రణ్ దీప్ హుడా, అర్జున్ రాంపాల్, జాక్రీ ష్రాఫ్, రచయిత గుల్జార్, సుభాష్ ఘాయ్ తదితరులు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VInod Khanna Funeral  Bollywood  Rishi Kapoor  Shameful Tweets  

Other Articles