Jyothika Sensational Comments On kollywood Directors.

Satires to jyothika over comments on star directors

Suriya wife Jyothika, Jyothika Sensational Comments, Jyothika Kollywood Directors, Jyothika Directors, Jyothika Husband, Jyothika Magalir Mattum Audio, Magalir Mattum Jyothika, Karthi Jyothika, Karthi Magalir Mattum Singer, Karthi Singer Jyothika, Jyothika New Movie, Magalir Mattum Release Date, Magalir Mattum Audio, Jyothika Re Entry

Suriya's wife Jyothika urges Kollywood directors not to portray women as bimbos in films at Magalir Mattum Satires to Jyothika first give such advice to her husband.

జ్యోతిక కామెంట్లకు సెటైర్ పడింది

Posted: 04/25/2017 03:55 PM IST
Satires to jyothika over comments on star directors

తమ విషయంలో మేకర్లు వ్యవహరించే తీరు ఇదీ అంటూ.. రోజుకో హీరోయిన్ సంచలన ప్రకటనలు చేయటం చూస్తూనే ఉన్నాం. నటి, సూర్య వైఫ్ జ్యోతిక కూడా తాజాగా ఇలాంటి కామెంట్లే చేసి కోలీవుడ్ లో కలవరమే లేపింది. మగలిర్ మట్రూమ్ చిత్ర ఆడియో రిలీజ్ సందర్భంగా స్టేజీ మీద ఎమోషనల్ అయిన జ్యో పెద్ద చిత్రాల దర్శకుల దుమ్ము దులిపేసింది.

ప్రస్తుతం హీరోయిన్లను ఎవరూ మనుషుల్లా చూడటం లేదు. వాళ్ల కోసం ఓ మంచి పాత్రను తీర్చిదిద్దే సమయం దర్శకుల దగ్గర లేకుండా పోతుంది. ఎంతసేపు ఇద్దరూ లేదా ముగ్గురు హీరోయిన్లను స్టార్ హీరో చుట్టూ చేర్చి గంతులేయించటంతోనే సరిపోతుంది. వాళ్లకు మంచి కాస్టూమ్స్ ఇవ్వండి. వాళ్లతో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించటం మానండి. సినిమాల ప్రభావం జనాల మీద ముఖ్యంగా ఫ్యాన్స్ మీద ఎక్కువగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని సినిమా తీయండి అంటూ పెద్ద క్లాసే పీకింది.

అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. పరాయి వాళ్ల మీద రాళ్లేసేటప్పుడు, ముందు మన అద్దాల మేడను ఓసారి చూసుకోవాలన్న సామెతను జ్యోతికకు గుర్తు చేస్తున్నారు కొందరు. నీ భర్త చేస్తుంది ఏంటీ? తన సినిమాల్లో హీరోయిన్లతో పీలికల్లాంటి బట్టలు కట్టించటం లేదా? ఐటెం సాంగ్ లతో స్టెప్పులేయటం లేదా? ముందు కుళ్లు కడిగేయటం నీ ఇంటి నుంచే ప్రారంభించూ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయ్. ఆ సంగతి పక్కన పెడితే మగలిర్ మట్రూమ్ లో ఓ జర్నలిస్ట్ రోల్ లో జ్యోతిక కనిపించబోతుందంట. ఇక ఈ సినిమాలో వదిన కోసం కార్తీ ఓ పాట కూడా పాడినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Magalir Mattum Movie  Jyothika  Kollywood Directors  

Other Articles