Bunny reminds Chiru in story selection | మెగా ఫ్యామిలీ.. బన్నీ ఒక్కడే సరైనోడా?

After chiru it is only allu arjun

Allu Arjun, Bunny, Mega Family, Allu Arjun, Bunny Chiru Successor, Chiranjeevi Allua Arjun, Allu Arjun Chiranjeevi, Allu Arjun Story Selection, Bunny Story Selection, Mega Family Heroes, Bunny Perfect Mega Hero

After Chiranjeevi Allu Arjun only mega hero choosing right scripts. Bunny Proved with Rudramadevi and Sarrainodu. Though many heroes said no to Sarrainodu story, Buuny picked it up and made 70+ crores hit. Rejected by top heroes, he dared to do a cameo as Gona Gannareddy and literally saved the whole of Rudramadevi movie.

చిరు రూట్ లో ఒక్క అల్లు అర్జునేనా?

Posted: 04/21/2017 05:56 PM IST
After chiru it is only allu arjun

ఒకప్పుడు సినిమాలను ఎంచుకోవటంలో మెగాస్టార్ చిరంజీవి చూపినంత కేర్ మరేయితర హీరో చూపేవాడే కాదన్న టాక్ ఒకటి ఉండేది. ఇతర హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో హిట్లు కొట్టడం, తాను రిజెక్ట్ చేసిన కథలతో అవతలి వాళ్లు ఫ్లాపులు చవిచూడటం.. ఇలా చిరు డెసిషన్ల మీద మేకర్లకి చాలా నమ్మకం ఉండేది. అయితే ఆ లక్షణాలు ఇప్పుడున్న మెగా ఫ్యామిలీలో ఒక్కరంటే ఒక్కరికి లేకపోవటమే ఇప్పుడు చర్చగా మారింది.

రాంచరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శీరిష్ ఇలా ఎవరిని చూసుకున్నా రాంగ్ ఛాయిస్ కథలతో బోల్తా పడుతున్నారన్న ఓ అభిప్రాయం నెలకొంది. అంతేందుకు ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కథలను ఎంపిక చేసుకోవటంలో తడబడటం చూస్తేనే ఉన్నాం. అందుకే చెర్రీ విషయంలో ఎప్పుడూ చిరు ఇన్ వాల్వ్ అవుతూనే ఉంటాడు కూడా. కానీ, మెగా ఫ్యామిలీ మొత్తం మీద ఒక్క అల్లు అర్జున్ మాత్రం స్పెషల్ గా చెప్పొచ్చు. అందుకు ఉదాహరణగా సరైనోడు, రుద్రమదేవి చిత్రాలను చెప్పొచ్చు.

సరైనోడు కథ ముందు చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లిన తర్వాతే బన్నీ దగ్గరికి వచ్చింది. తన క్రేజ్ తోనే దానిని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టి 70 ఫ్లస్ కలెక్షన్లు రాబట్టడానికి కారణమయ్యాడు. ఇక రుద్రమదేవి విషయంలోనూ అంతే. గోన గన్నారెడ్డి పాత్రకు కూడా ముందు మరో ఇద్దరు స్టార్ హీరోల పేర్లు వినిపించినప్పటికీ, చివరకు బన్నీ ఓకే చేయటం, ఆ పాత్ర ఎంతగా పేలిందో చెప్పనక్కర్లేదు. రీసెంట్ మిస్టర్ సినిమాను తప్పుకోవటం కూడా బన్నీ ఛాయిస్ ఎంత కరెక్ట్ గా ఉందో తెలియజేస్తుంది.

ఇలా మోస్ట్ ఎంటర్ టైనింగ్ ఉన్న పాత్రలను ఎన్నుకుంటూ ఒకప్పుడు చిరును తలపిస్తున్నాడని సినీ పెద్దలు చెప్పుకుంటున్నారు. అయితే దర్శకులను నమ్మి చిరు చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ దాఖలాలు ఉన్నాయి. ఆ విషయంలో మాత్రం బన్నీ కాస్త జాగ్రత్తగా ఉంటే చాలని వారు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Script Selections  Mega Family  

Other Articles