వాళ్లు తిట్టారనే నేను తిట్టా.. సారీ వీడియోలో సత్యరాజ్ | Satyaraj finally seeks sorry from Kannadigas.

Satyaraj apology to kannada people

Baahubali Actor, Sathyaraj Sorry, Baahubali 2 Sathyaraj, Sathyaraj Sorry Video, Sathyaraj Apology Video, Sathyaraj Kannadigas, Sathyaraj Request Kannada People, Sathyaraj Kannada Release, Baahubali 2 Kannada Clash End, Sathyaraj Comments, Sathyaraj Explanation, Kattappa Kannadigas, Kattappa Sorry, Kattappa Apology Kannadigas, Sathyaraj Video

Finally Baahubali Actor Satyaraj ask apology to Kannadigas.

బాహుబలి-2 వివాదం... సత్యరాజ్ సారీ చెప్పేశాడు

Posted: 04/21/2017 12:42 PM IST
Satyaraj apology to kannada people

తమిళ నటుడు సత్యరాజ్ ఎట్టకేలకు కన్నడ గుడిలకు క్షమాపణలు చెప్పాడు. కొన్నేళ్ల క్రితం కావేరి జల వివాదాల సందర్భంగా కన్నడ ప్రజలను ఉద్దశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఈ సీనియర్ నటుడు. తిరిగి బాహుబలి-2 రిలీజ్ సందర్భంగా ఆ వ్యాఖ్యలను సాకుగా చూపుతూ సినిమాను అడ్డుకుంటామని కొన్ని కన్నడ సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో కలగజేసుకున్న దర్శకుడు రాజమౌళి నిన్న కన్నడ భాషలోనే వాళ్లకు విజ్నప్తి చేశాడు కూడా. అయినా శాంతించని వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో సత్యరాజ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. తామేం సినిమాకో లేక రాజమౌళికో వ్యతిరేకం కాదని, తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన సత్యరాజ్ సారీ చెప్పాల్సిందేనని తేల్చేశారు.

దీంతో రంగంలోకి దిగిన కట్టప్ప అలియాస్ సత్యరాజ్ చివరకు క్షమాపణలు చెప్పేశాడు. నాడు కావేరి ఉద్యమ సమయం సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో కన్నడ నటులు కూడా తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. వారికి కౌంటర్ గానే అలా మాట్లాడాల్సి వచ్చింది. అందుకు క్షమాపణలు అంటూ వీడియోలో తలపైకెత్తి చూడకుండా చదివి వినిపించాడు.

 

తన వ్యాఖ్యలు సినిమా రిలీజ్ కు అడ్డంకి కారాదన్న సత్యరాజ్, ఈ వివాదానికి ముగింపు పలికి సినిమా రిలీజ్ కానివ్వాలని కన్నడ ప్రజలకు విజ్నప్తి చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. దీంతో వివాదానికి దాదాపుగా తెరపడినట్లే అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Sathyaraj  Apology  Kannadigas  

Other Articles