జంధ్యాలను కామెంట్ చేయలేదని క్లారిటీ అవసరమా? | Brahmi clarity on Jandhyala issue.

Brahmi clarity on jandhyala issue

Director Jandhyala, Director Jandhyala Comments, Brahmanandam MEK Chiranjeevi, Chiranjeevi Brahmi Jandhyala, Jandhyala Brahmanandam, Brahmi Comments on Jandhyala, Jandhyala Wife Annapurna, Director Jandhyala Wife Name, Jandhyala Wife Annapurna Sastry, Chiru Brahmi Annapurna

Comedian Brahmanandam explanation on controversy over comments on Director Jandhyala.

జంధ్యాల వివాదంపై బ్రహ్మీ క్లారిటీ

Posted: 04/15/2017 03:56 PM IST
Brahmi clarity on jandhyala issue

ఇప్పటికే సరిగ్గా సినిమాలు లేక క్రేజ్ పొగొట్టుకున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ మధ్యే ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తనని సినిమాలకు పరిచయం చేసిన గురువు జంధ్యాలను ఉద్దేశించి తాగుబోతు అనే అర్థం వచ్చేలా కామెంట్లు చేయటం, దానిపై ఆ దివంగత లెజెండరీ దర్శకుడు భార్య అన్నపూర్ణ సీరియస్ రియాక్షన్ అలా సాగిపోయిందా ఎపిసోడ్.

అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో తాను కామెడీ బ్రహ్మాపై ఒక్కటంటే ఒక్క నెగటివ్ కామెంట్ కూడా చేయలేదని బ్రహ్మీ క్లారిటీ ఇచ్చాడు. ''ఎవరో ఒకతను మీరు తాగారా అని జంధ్యాలను ప్రశ్నిస్తే.. ఆయన సెన్సాఫ్ హ్యుమర్ తో ఆ కామెంట్ ను కూడా కామెడీగా మార్చేశాడని చెప్పాను. అంతేకానీ ఆయన తాగుతారని అనలేదు. అటు ఆవిడ.. ఇటు మీడియా తెగ హడావుడి చేసి కల్పిత కథలు అల్లేస్తున్నారు'' అంటున్నాడు

కానీ, జంధ్యాల భార్య అన్నపూర్ణ తనని అపార్థం చేసుకుందని, ఆయనకి తాగుడు అలవాటు ఉందని తానెక్కడా పేర్కొనలేదని, ఆమెకు బాధకలిగి ఉంటే సారీ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, ఇప్పటికే అవకాశాలు లేక డల్ అయిపోయిన బ్రహ్మీ కి తాజా వివాదం మరింత తలనొప్పి తెచ్చిపెట్టినట్లయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmanandam  Director Jandhyala  Comments  Wife Annapurna  

Other Articles