హిట్ కోసం షారూఖ్ ఫార్ములానే ఫాలో అవుతున్నాడు | After SRK Emraan Hashmi in Dwarf role.

Another bollywood superstar in dwarf role

Emraan Hashmi, Emraan Hashmi Dwarf Role, Emraan Hashmi Upcoming Movies, Emraan Hashmi 2017 Movies, Emraan Hashmi Nikhil Advani, Sha Rukh Khan Emraan Hashmi

Bollywood Hero Emraan Hashmi is gearing up to play a dwarf in a film to be directed by 'Aashiqui 2' fame Mohit Suri.

మరుగ్గుజ్జు రోల్ లో మరో బాలీవుడ్ హీరో

Posted: 03/22/2017 12:49 PM IST
Another bollywood superstar in dwarf role

పెద్దా, చిన్నా హీరోలంతా ఇప్పుడు ప్రయోగాలకే ఎగబడిపోతున్నారు. సినిమాలు తేడా కొడుతున్నా సరే క్రిటిక్స్ నుంచి ప్రోత్సాహం వస్తుండటంతో వాటివైపు మొగ్గు చూపుతున్నారు. ఫ్యాన్ సినిమా తేడా కొట్టినా సరే వెనకంజ వేయని సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇప్పుడు మరుగుజ్జు రోల్ తో రెడీ అయిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హీరో కూడా అదే బాటలో నడవబోతున్నాడు.

బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ కూడా త్వరలో ఎక్స్ పెరిమెంటల్ గా ఓ ఢిఫరెంట్ రోల్ లో మెరవబోతున్నాడంట. నిఖిల్ అద్వానీ డైరక్షన్ లో తెరకెక్కబోయే కొత్త ప్రాజెక్టు కోసం మరుగుజ్జు రోల్ లో కనిపించబోతున్నాడని టాక్. అయితే షారూఖ్, ఇమ్రాన్ రోల్స్ కి చాలా తేడా ఉంటుందని తెలుస్తోంది. పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ కోసం ఇమ్రాన్ సరికొత్త రూపంలో దర్శనమివ్వబోతున్నాడంట.

దాదపు ఐదేళ్లు లవర్ బాయ్ తరహా పాత్రలతో ఆకట్టుకున్న ఇమ్రాన్ హష్మీ తర్వాత రాంగ్ సెలక్షన్ తో ఘోరంగా దెబ్బతిన్నాడు. హిట్ అనే పదానికి చాలా ఏళ్లుగా దూరమైన ఈ భట్ ఫ్యామిలీ హీరో ఎలాగైనా దానికోసం యత్నిస్తున్నాడని అర్థమౌతోంది. ప్రస్తుతానికైతే ఇమ్రాన్ హష్మీ బాద్ షావో లో నటిస్తున్నాడు. అజయ్ దేవగన్ హీరో కాగా, ఇలియానా, ఇషా గుప్తాలు హీరోయిన్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Emraan Hashmi  Dwarf Role  Nikhil Advani Movie  

Other Articles