ఆ స్టార్ హీరో వెనుక ఉన్న దర్శకుడు ఇక లేడు | Prudhvi Raj's Puthiya Mugham director Deepan passes away.

Director deepan passes away

Puthiya Mukham Director, Director Diphan Died, Director Diphan Passes Away, Puthiya Mukham Director Diphan Death, Prudhvi Raj Puthiya Mukham, Mollywood Director Death, Prudhvi Raj Diphan

Puthiya Mukham director Diphan passes away in Kochi.

మళయాళ దర్శకుడు దీపన్ కన్నుమూత

Posted: 03/13/2017 04:14 PM IST
Director deepan passes away

తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను డైరక్ట్ చేసిన దర్శకుడు హఠాన్మరణం మాలీవుడ్ ను దిగ్ర్బాంతికి గురిచేసింది. యువ దర్శకుడు దీపన్ చేతన్ (47) సోమవారం కన్నుమూశాడు. తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 26 నుంచి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.

ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న పృథ్వీ రాజ్ హీరోగా ఫుథియా ముఖం, డీ కంపెనీ, హీరో, లీడర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అసిస్టెంట్‌ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన ఆయన 2003లో ‘లీడర్ కింగ్ మేకర్ ' అనే పొలిటికల్ థ్రిల్లర్ ను అందించాడు. ఆపై ఆరేళ్ల గ్యాప్ తో 2009 లో పృథ్విరాజ్‌ నటించిన "పుతియా ముఖం" సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

సురేష్ గోపితో డాల్ఫిన్ బార్ అనే చిత్రత తీశాడు. చివరిసారిగా జయరామ్, రోమా జంటగా సత్య సినిమాను తీయగా, అది ఇంకా రిలీజ్ కాలేదు. కాగా, దర్శకుడి ఆకస్మిక మరణంపై మాలీవుడ్ ప్రముఖులు ఫేస్‌బుక్‌ ద్వారా విచారాన్ని వ్యక్తం చేశారు. తన కెరీర్ ఎదుగుదలకు ఎంతో సహకరించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పృథ్వీరాజ్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mollywood Star Director  Diphan Death  Pruthvi raj Condolence  

Other Articles