సుచిలీక్స్ పై గీతామాధురి షాకింగ్ రెస్పాన్స్.. | Geetha Madhuri Comments On Singer Suchitra.

Telugu singer on suchitra leaks

Singer Geetha Madhuri, Geetha Madhuri Suchi Leaks, Geetha Madhuri Suchitra, Tollywood Singer Support Geetha Madhuri, Geetha Madhuri Shocking Comments, SuchiLeaks

Geetha Madhuri Shocking Comments On Singer Suchitra.Singer Geetha Madhuri is the only outsider to come in support of Suchitra Karthik. 'I don't believe the reports that Suchitra has gone mad. She isn't weak mentally to fall prey to depression. Hopefully, The truth comes out soon.

సుచిత్ర వ్యవహారంపై స్పందించిన గీతా మాధురి

Posted: 03/13/2017 05:59 PM IST
Telugu singer on suchitra leaks

సుచి లీక్ యాష్ ట్యాగ్ కేవలం కోలీవుడ్ నే కాదు, యావత్ సౌత్ ఇండస్ట్రీని కూడా షేక్ చేసి పడేసింది. ధనుష్ నుంచి మొదలై త్రిష, అమలాపాల్, నయనతార, రానా, ఆండ్రియా, అనిరుధ్, శింబు, చిన్మయి, సెల్వరాఘవన్ ఇలా... సాగుతూ వచ్చింది. చివర్లో సంచిత, అనూహ్య దగ్గర ఆగిపోయిన ఈ వ్యవహారం వారి పర్సనల్ ఫోటోలు, వీడియోల దగ్గర ఆగిపోయింది.

అయితే ఈ విషయంలో నోరు మెదిపితే తమకే మోసం వస్తుందన్న భయంతో అంతా గప్ చుప్ అయిపోయారు. కానీ, ఈ విషయంలో తెలుగు సింగర్ గీతా మాధురి మాత్రం చాలా ధైర్యంగా సమాధానాలిస్తోంది. ఒక న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నకు ప్రముఖ గాయని గీతా మాధురి స్పందిస్తూ.. ‘సుచిత్ర ఈజ్ వెరీ స్ట్రాంగ్.. డిప్రెషన్ కు లోనయ్యే మనస్తత్వం కాదు. ఆమె సింగర్ మాత్రమే కాదు రేడియో జాకీ, రైటింగ్ స్కిల్స్ .. ఇలా చాలా ఉన్నాయి. కనుక చాలా అవకాశాలు లభిస్తుంటాయి. చాలా బిజీగా ఉంటుంది.

అవకాశాలు లేకపోవటం మూలంగానే డిప్రెషన్ కు గురయ్యే స్టేజ్ లో ఆమె ఉందని ఒక స్నేహితురాలిగా నేను అనుకోవట్లేదు. అయితే, అసలు ఏం జరిగిందో మరి! ... ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇప్పటిదాకా టోటల్ సౌత్ నుంచి ఆమెకు లభించిన ఏకైక సపోర్ట్ గీతా మాధురియే అని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Singer  Geetha Madhuri  Suchitra Karthik  Suchi Leaks  

Other Articles