బాహుబలి చిన్న టీజర్ లో ఏముంది? | Baahubali 2 small teaser released.

Baahubali 2 teaser released

Baahubali 2, Baahubali The Concludion Teaser, Baahubali-2 Official Teaser, Baahubali New Teaser, Baahubali 2 Pre Trailer Video, Baahubali 2 Trailer Date

Baahubali team released Conclusion Teaser.

బాహుబలి-2 టీజర్ విడుదల

Posted: 03/13/2017 12:52 PM IST
Baahubali 2 teaser released

ఈ వారం టాలీవుడ్ చరిత్రలో ఓ మరిచిపోలేని వారం. దేశం అంతా ఎంతో ఆత్రుతతో ఊపిరి బిగబట్టుకుని ఎధురు చూస్తున్న బాహుబలి-2 ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. వెరసి ఏప్రిల్ 28 నుంచి ప్రారంభం కాబోతున్న కలెక్షన్ల సునామీకి త్వరలో బీజం పడనుందన్న మాట. ఇక ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పిక్చర్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విశేషాలతో ఇప్పటికే బాహుబలిని అంచనాలను అమాంతం పెంచేసింది చిత్ర యూనిట్.

మరో మూడు రోజుల్లో చిత్ర ట్రైలర్ మన ముందుకు రానుండగా, చిత్రం కోసం ఓ చిన్న టీజర్ ను రిలీజ్ చేసింది. దెబ్బలతో ఉన్న శివుడు, దానికి ముందు క్లోజప్ షాట్ లో ఓ శివలింగంపై రక్తపు ధారలు పారుతున్నట్లు గా చూపించారు. తెలుగు, తమిళ్, హిందీతోసహా అన్ని భాషల్లో ఈ వీడియోను రిలీజ్ చేసేశారు.

గురువారం విడుదల కానున్న ట్రైలర్ కంటే ఆలస్యం అవుతున్నా ఏ మాత్రం క్రేజ్ ను తగ్గించుకోవట్లేదు. బాహుబలి-2 ట్రైలర్‌ అధికారికంగా ఈ గురువారం (మార్చి-16)న విడుదల కానున్న విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Teaser  Trailer Poster  

Other Articles