బాలయ్య కోసం పూరీ మార్క్.. అక్కర్లేదు బాస్ | No Puri Mark for Balayya 101.

Balayya original version in puri movie

Puri Jagannadh Balakrishna, Balakrishna 101 Movie, No Puri Mark, Puri Mark, Balayya Mannerism, Balakrishna Attitude, Actor Balakrishna Mannerism, Puri Balayya, Original Balayya

Director Puri Jagannadh direct Balakrishna's 101 Movie. Nandamuri Balakrishna has certain attitude in the industry. He has certain mannerisms and trademark style. Now director Puri Jagannadh is going to have all these elements in his next film with Balayya.

ఒరిజినల్ బాలయ్యను పూరీ చూపిస్తాడా?

Posted: 02/28/2017 08:42 AM IST
Balayya original version in puri movie

హీరోలందరిలో బాలయ్యది ఓ డిఫరెంట్ స్టైల్. నందమూరి నట వారసుడిగా ఎంట్రీ తర్వాత స్టార్ రేంజ్ కి ఎదిగటం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత కూడా కొత్త వాళ్లతో కలిసి ప్రయోగాలు చేయటం బాలయ్యకే సొంతం అని చెప్పుకోవాలి. కానీ, ఆన్ స్క్రీన్ లో ఎలా ఉన్నప్పటికీ, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం బాలయ్య ప్రవర్తనపై చాలా సార్లు వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు దీనినే ప్రధానాంశంగా చేసుకుని 101 వ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.

రేరెస్ట్ కాంబో గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 101వ చిత్రంలో నటించబోతున్నాడు బాలకృష్ణ. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు అందుతోంది. సాధారణంగా హీరోలను లుక్కుల పరంగానే కాదు, వారి మేనరిజంకు సంబంధం లేకుండా కాస్త వెరైటీగా చూపిస్తుంటాడు పూరీ. అదే పూరీ సక్సెస్ కు కారణం కూడా. రిజర్వ్ గా ఉండే మహేష్ ను పోకిరి, బిజినెస్ మెన్ లో చూపించిన తీరు, టెంపర్ లో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రయోగాలు చేస్తుంటాడు.

కానీ, ఇప్పుడు బాలయ్య విషయంలో మాత్రం అలాంటివి ఏం ఉండవంట. పూర్తిగా ఆయన ఒరిజినల్ మేనరిజమ్స్ ను చూపించే దిశగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడని టాక్. వందో చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సయ్యాయని తెగ ఫీలవుతున్న నందమూరి ఫ్యాన్స్ కు ఇది నిజంగా పండగ లాంటి వార్తే కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Puri Jagannadh  Actor Balakrsihna  101 Movie  

Other Articles