కమెడియన్ పొట్టి చిట్టిబాబు ఇక లేడు | Kollywood Veteran comedian Passes Away.

Thavakalai chitti babu passes away

Kollywood Veteran Comedian, Thavakalai Chitti Babu, Comedian Thavakalai, Thavakalai Died, Kollywood Senior Comedian, Thavakalai Heart Attack, Comedian Chitti Babu Death

Veteran comedian of Tamil Industry Thavakalai Chitti Babu has died yesterday suddenly leaving his well wishers and fans in vain.This short actor has created his own zone despite heavy competition from other contemporary comedians.This 42 years old experienced comedian has acted in 490+ films including Telugu, Tamil, Kannada, Hindi, Malayalam and Sinhala languages. He has been working in small screen due to the lack of offers in movies.

సీనియర్ కమెడియన్ తవకలై కన్నుమూత

Posted: 02/27/2017 06:06 PM IST
Thavakalai chitti babu passes away

కోలీవుడ్ లోనే కాదు తెలుగు, మలయాళం, హిందీ, సింహళ భాషల్లోని సినిమాల్లో న‌టించి న‌వ్వులు పూయించిన సీనియర్ నటుడు తవకలై(44) ఇక లేడు. మరుగుజ్జు కమెడియన్ గా పాపులర్ అయిన తవకలై అసలు పేరు చిట్టి బాబు. స్వగ్రామం వడపలానిలో ఆదివారం రాత్రి గుండెపోటుతో చనిపోయాడు. 1983లో భాగ్యరాజ్ దర్శకత్వంలో ముందనై ముడిచ్చు ద్వారా ఆయన ఆరంగ్రేటం చేశాడు.

సుమారు 490కిపైగా చిత్రాల్లో నటించి అంద‌రినీ మెప్పించారు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో పాటు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన నటించాడు కూడా. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సినీ అవకాశాలు త‌గ్గిపోవ‌డంతో బుల్లితెరపై న‌టిస్తూ ఉన్నాడు.

ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలుసుకున్న‌ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రమే ఆయ‌న అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Veteran Comedian  Thavakalai  Chitti Babu Death  

Other Articles