భావన కేసులో నిందితుడికి నిర్మాత ఫోన్ కాల్ నిజమే.. కానీ... | Anto Joseph explained why he make a call to Pulsar Suni.

Anto joseph about his involvement in bhavana kidnap case

Producer Anto Joseph, Producer Bhavana Molestation Case, Bhavana Molestation, Pulsar Suni Bhavana, Actress Bhavana Case, Bhavana Kidnap and Molestation, Actress Bhavana, Producer Anto Joseph Phone Call, Malayalam Star Producer Bhavana, Actress Molestation

Producer Anto Joseph has been in the news ever since the shocking incident where popular actress Bhavana was waylaid and attacked in Kochi began to be reported. Now, the producer has come forward and revealed what really happened on the fateful night.

భావన కేసులో నిర్మాత ఏం చెబుతున్నాడు?

Posted: 02/21/2017 04:28 PM IST
Anto joseph about his involvement in bhavana kidnap case

ఓ స్టార్ హీరోయిన్ కే రక్షణ లేకుండా పోయిందంటూ కేరళ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు కొనసాగుతుండగా, కేసు లో నెమ్మదిగా కొత్త కొత్త పేర్లు వెలులుగోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నిందితుడి పల్సర్ సునీకి ఫోన్ చేశాడన్న ఆరోపణలు నిర్మాత ఆంటో జోసెఫ్ మెడకు చుట్టుకున్నాయి. దీంతో ఆయన వాటిపై వివరణ ఇస్తూ ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో వివరించాడు. 

ఘటన జరిగిన తర్వాత మొదట దర్శకుడు లాల్ తనకు ఫోన్ చేశారని ఆయన చెప్పారు. అయితే తన ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండడంతో ఎత్తలేకపోయాడంట. ఆ తర్వాత రెంజీ పనిక్కర్ తనకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పారని, సాధ్యమైనంత త్వరగా లాల్ ఇంటికి రమ్మని చెప్పడాని, దాంతో తాను ఎమ్మెల్యే పిటి థామస్‌తో కలిసి తాను లాల్ ఇంటికి చేరుకున్నానని తెలిపాడు.

అప్పటికే పోలీసులు, కేసులో మరో నిందితుడు మార్టిన్ అప్పటికే అక్కడ ఉన్నట్లు వివరించాడు. ఆపై ఎమ్మెల్యే పిటి థామస్ మార్టిన్‌ను ప్రశ్నించారని, ఆపై తన ఫోన్ నుంచి మార్టిన్ తో సునీకి ఫోన్ చేయించగా లిఫ్ట్ చేయలేదని తెలిపాడు. మొదట అతను ఫోన్ ఎత్తలేదని, కానీ ఆ తర్వాత రిటర్న్ కాల్ చేసి నువ్వు ఎవరని అడగ్గా ఆంటో అనగానే కట్ చేశాడని తెలిపాడు. అంతే తప్ప తనకు సునీతో ఏ విధమైన సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని తాను పోలీసులకు కూడా చెప్పినట్లు తెలిపాడు. భావనపై లైంగిక వేధింపులు దారుణమైన ఘటన అని పేర్కొన్న ఆంటో, ఇలాంటి ఘటన ఏ అమ్మాయికి కూడా జరగకూడదని తెలిపాడు.

ఖచ్ఛితంగా సినిమాల ప్రభావమే...

సీనీ నటి భావనపై అత్యాచార ఘటన నేపథ్యంలో, సినీ పరిశ్రమ పోకడలపై ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మండిపడ్డారు. పితృస్వామ్యాన్ని నెత్తికెక్కించుకుని, హీరోయిజాన్ని హైలైట్ చేసినంత కాలం పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా నటులకు నిజమైన మద్దతు దొరకదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 99 శాతం సినిమాల్లో హీరోయిజాన్నే చూపిస్తున్నారని ఆయన అన్నారు.

ఫ్యామిలీ డ్రామాలు, కాలేజీ సినిమాల్లో సైతం పురుషాధిక్యాన్నే చూపిస్తున్నారని తెలిపారు. ఈ సినిమాల్లో మహిళల వ్యతిరేక భావజాలం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి పోకడలు కొనసాగినంత కాలం నటికి అన్యాయమే జరుగుతుంటుందని తెలిపారు. ఇప్పటికైనా హీరోలు తమ డాంబికాలను తగ్గించుకోవాలని సూచించారు. సెక్సీ దుర్గ, ఒళివుడివసథె కాలి వంటి వైవిధ్యభరితమైన చిత్రాలను సనల్ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాల్లో కూడా మేల్ డామినేషన్ కు వ్యతిరేకంగానే తెరకెక్కటం విశేషం.

 

హీరో పగ.. భావన పై రేప్ అటెంప్ట్??

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Bhavana  Molestation  Producer Anto Joseph  

Other Articles