హోమ్లీ బ్యానర్ లో బూతు సినిమానా?.. ఎందుకంత దిగజారాడు? | Karan Johar to produce a sex comedy soon with 'Dharma values' intact.

Karan johar to produce a sex comedy

Karan Johar Adult Comedy, Karan Johar Dharma Production, Karan Johar Banner, Karan Johar Next Movie, Karan Johar Sex Comedy, Karan Johar Get A Room, Get A Room Movie, Gippi Director, Gippi Karan Johar , Get A Room Director Sonam Nair, Sonam Nair Karan Johar, Baahubali Producer Adult Comedy

Star Producer Karan Johar set to produce a sex comedy for the first time. is next production tentatively titled Get A Room, which will be a sex comedy. The film will be helmed by Sonam Nair, who had earlier directed Karan Johar produced film Gippi.

కరణ్ బ్యానర్ లో అడల్ట్ కామెడీ మూవీనా?

Posted: 02/21/2017 03:56 PM IST
Karan johar to produce a sex comedy

ఓవైపు రొమాంటిక్ లవ్ స్టోరీలనేకాదు, అప్పుడప్పుడు కుటుంబ సమేతంగా ఆదరించే చిత్రాలను కూడా అందిస్తుంటాడు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్. ఓవైపు సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమాలు తీస్తూనే మరోవైపు తన సొంత సంస్థతోనే బయటి చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని కూడా తానే డీల్ చేయటంతో బ్యానర్ ఖ్యాతి మరింత పెరిగింది.

అయితే ఇంత కాలం కొన్ని విలువలను పాటించిన కరణ్ వాటికి త్వరలో పుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. తన బేనర్ లో ఓ సెక్స్ కామెడీ సినిమాను రూపొందించేందుకు సిద్ధమైపోయాడు. అది కూడా ఓ మహిళా దర్శకురాలితో కావటం కొసమెరుపు. సోనమ్ రాయ్ అనే ఉమెన్ డైరక్టర్ గెట్ ఏ రూమ్ పేరుతో ఓ సినిమాను ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో తీయబోతున్నాడు. కొత్త వాళ్లను హీరోహీరోయిన్లుగా ఎంచుకున్నట్లు సమాచారం.

అయితే పేరుకే సెక్స్ కామెడీ అయినప్పటికీ అడల్ట్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండకుండ కరణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడంట. తన సంస్థకు ఓ బ్రాండ్ నేమ్ ఉందని, అది దెబ్బతినే విధంగా ఎలాంటి చిత్రాలు తీసే ప్రసక్తే లేదని అంటున్నాడు కరణ్. పైగా కథలో మంచి డెప్త్ ఉండటంతోనే ముందుకు వచ్చానని వివరించాడు కూడా. అంటే విలువలతో కూడిన సెక్స్ కామెడీ అన్న మాట. వినటానికి విడ్డూరంగా ఉంది కదూ!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karan Johar  Adult Comedy  Get A Room  Sonam Nair  Dharma Productions  

Other Articles