రజనీ రొమాన్స్.. ఏంటీ డెసిషన్ | Rajinikanth no more romance in upcoming movies.

Bollywood star heroine in rajinikanth next

Rajinikanth, Rajinikanth Pa Ranjith, Vidya Balan in South Movies, Rajinikanth Vidya Balan, Dirty Beauty for Rajinikanth, Rajinikanth Romance, Rajnikanth 2017 Movies

Director Ranjith who did "Kabali" with Rajinikanth has already begun casting for the second film with the superstar. The film is being promoted as "Kabali 2". Vidya Balan has already been approached to do the female lead but she is yet to sign it officially.Rajinikant is said to be of opinion that he should not romance with younger heroines as he has crossed 65.

రజనీకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్?

Posted: 02/21/2017 01:22 PM IST
Bollywood star heroine in rajinikanth next

అభిమానుల కోరిక మేరకు లీడ్ పెయిర్ గా యంగ్ హీరోయిన్లతో, ఫ్రెష్ ఫేస్ లతోనే కానచ్చేందుకు స్టార్ హీరోలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే రజనీ కాంత్ మాత్రం ఆ విషయంలో కాస్త వైవిధ్యంగానే వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రోబో-2 లో పట్టుమని పాతికేళ్లు కూడా లేని అమీ జాక్సన్ తో జోడీ కడుతున్నప్పటికీ అది కంప్లీట్ గా శంకర్ రిక్వర్ మెంటే నంట. డ్యుయెట్లు, రొమాన్స్ ఉండబోవని సమాచారం. ఆ సినిమా తప్పించి మిగతా సినిమాల వరకు మాత్రం తన నిర్ణయాన్నే అమలు అయ్యేలా చూసుకుంటున్నాడు.

రోబో శంకర్ ఐశ్వర్యని, కబాలి కోసం రాధికా ఆప్టేని ఎంపిక చేసుకున్న రజనీ త్వరలో మరో థర్టీ ఫ్లస్ నటితోనే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. కబాలి దర్శకుడు పా రంజిత్ తో త్వరలో కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నాడు తలైవా. ఈ సినిమా కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. 65 ఏళ్లు పైబడ్డ రజనీ తన వయసు రీత్యా ఇంకా కుర్రహీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించటం మంచిది కాదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అల్రెడీ విద్యాబాలన్ ప్రాజెక్టుపై సైన్ కూడా చేసినట్లు భోగట్టా.

Rajinikanth Vidya Balan Movie

ఇక రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తొలుత కబాలి సీక్వెల్ అని చెప్పినప్పటికీ ఫ్రెష్ డాన్ స్టోరీతోనే రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు రంజిత్. తమిళ ఉగాది తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Pa Ranjith  Vidya Balan  New Movie  

Other Articles