బిగ్ బీ, మున్నా భాయ్ ను వదలని ఖుల్లం ఖుల్లా... | Amithabh and Sanjay Dutt targeted by Rishi Kapoor.

Rishi kapoor khullam khulla create sensation

Rishi Kapoor, Khullam Khulla, Uncensored Rishi Kapoor, Tina Munim love story, Tina Ambani love stories, Amitabh Bachchan Rishi Kapoor, Amitabh Bachchan Khullam Khulla, Khullam Khulla Rishi Affairs, Sanjay Dutt Tina Ambani

Rishi Kapoor in Khullam Khulla : Sanjay Thought I Was Having Affair With Tina Munim. Amitabh Bachchan Never Gave Co-Actors Credit.

ఖుల్లం ఖుల్లా మరిన్ని సంచలనాలు

Posted: 01/19/2017 11:02 AM IST
Rishi kapoor khullam khulla create sensation

ఖుల్లం ఖుల్లా పేరుతో తన స్వీయ చరిత్ర పుస్తకం, పైగా అన్ సెన్సార్ పేరు మూలానా ఏమో సీనియర్ నటుడు రిషి కపూర్ బాంబుల మీద బాంబులు పేలుస్తున్నాడు. ఇప్పటికే తండ్రి అఫైర్ల గురించి, కొడుకు రణ్ బీర్ తో సక్రమైన రిలేషన్ లేకపోవటం, 30 వేలు పెట్టి బాబీ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కొనటం ఇలా చాలా సంచలనాలే అందులో పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరిన్ని విషయాలను వెల్లడించాడు.

ఏకంగా అమితాబ్ బచ్చన్ నే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో అమితాబ్ యాంగ్రీ యంగ్ మన్, అతని కోసమే కథలు, సినిమాలు పుట్టుకొచ్చేవి. అలాంటి వ్యక్తి సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలోనే వేసుకునే వాడు. అంతేకాదు తనతోపాటు నటించిన కో-స్టార్లను బిగ్ బీ చిన్న చూపు చూసేవాడని, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ నేరం ఇతరుల మీదకు నెట్టేసే గుణం ఉందంటూ కాస్త ఘాటుగానే తెలిపాడు. ఆ సమయంలో మేమూ చిన్న పాత్రలు పోషించాం, ఆపై స్టార్ డమ్ వచ్చింది. కానీ, ఎన్నడూ అమితాబ్ లా మాత్రం ప్రవర్తించలేదంటూ వివరించాడు.

ఇక ఓ బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ కు తనకు జరిగిన ఓ ఫైట్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. కర్జ్ సినిమా చేస్తున్న సమయంలో టీనా (అనిల్ అంబానీ భార్య) తో క్లోజ్ నెస్ చూసి అఫైర్ అంటగట్టారంట. అప్పటికీ రిషికి ఇంకా పెళ్లి కాలేదు. ఇంకోవైపు టీనా మాత్రం తన రాకీ సినిమా హీరో అయిన సంజయ్ దత్ లు ప్రేమలో ఉంది. రూమర్ గురించి తెలిశాక రిషిపై కోపంతో మరో నటి నీతూ సింగ్(రిషి కపూర్ భార్య) అపార్ట్ మెంట్ కు సీరియస్ గా వెళ్లాడంట. అయితే వివాదం పెద్దది కాకుండా నీతూ సంజయ్ కి సర్ది చెప్పిందంట.

టీనా-చింటూ(రిషి) మంచి ఫ్రెండ్స్ మాత్రమే. ఇండస్ట్రీలో ఉంటున్నావ్ ఇలాంటి వ్యవహారాలు మనకు కొత్తేం కాదు కదా అని సర్ది చెప్పిందంట. ఆ విషయాన్ని మరో నటుడు గుల్షన్ గ్రోవర్ గుర్తు చేయటం, సంజయ్, రిషిలు నవ్వుకోవటం కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత సంజయ్ దత్ డ్రగ్స్ పెద్ద మొత్తంలో తీసుకోవటం, టీనా అతనికి, సినిమాలకు గుడ్ బై చెప్పి చివరకు బిజినెస్ టైకూన్ అంబానీ ఇంటి కొడలు జరిగిపోవటం తెలిసిందే. ఈ విషయాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తుండటంతో బాలీవుడ్ వర్గాలు ఇంకెన్ని బయటపడతాయో అని ఆసక్తిగా చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khullam Khulla  Rishi Kapoor  Amitabh Bachchan  Tina Ambani  Sanjay Dutt  

Other Articles