ప్రభాస్ తో అఫైర్ గురించి ఓపెన్ అయ్యింది | Jwala Gutta Loves Prabhas as Artist Only.

Gutta jwala clarifies her comment on prabhas

Gutta Jwala, Rebel Star Prabhas, Gutta Jwala Affairs, Prabhas Affair, Hero Prabhas Rumours, Tollywood Rumours, Tollywood Affairs, Prabhas and Gutta Jwala, Gutta Jwala About Prabhas, Gutta Jwala Interview, Gutta Jwala on Gossips, Gutta Jwala Rumours, Hyderabadi Badminton Player Gutta Jwala

Badminton Player Gutta Jwala Clarifies Her Comment on Prabhas. She Loves Prabhas as Hero only.

నాకు, ప్రభాస్ కు ఎలాంటి అఫైర్ లేదు: గుత్తా జ్వాల

Posted: 02/07/2017 04:15 PM IST
Gutta jwala clarifies her comment on prabhas

చిన్న హింట్ దొరికితే చాలూ ఆటోమేటిక్ కథలు అల్లేసి అఫైర్లు అంటగడుతూ పెనుదుమారం రేపుతున్న ఈ రోజుల్లో ఆ మధ్య ఓ టాలీవుడ్ ఓ జంట గురించి పెద్ద చర్చే జరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాలకు మధ్య ఏదో నడుస్తుందంటూ ఆ మధ్య కొన్ని వెబ్ సైట్లు కథనాలు వెలువరించాయి. కొన్నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో గుత్తా జ్వాల మాట్లాడుతూ ఛాన్స్ దొరికితే ప్రభాస్ పక్కన మాత్రమే తాను నటిస్తానంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది.

అంతే కాజువల్ గా గుత్తా అన్న మాటలను సీరియస్ గా తీసుకున్న మీడియా ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తుందహో అంటూ ఓ వార్తను రాసి పడేశాయి. అంతేకాదు చేతన్ తో విడాకులు తీసుకున్నాక ప్రభాస్ కి దగ్గరైందని, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, అందుకే గుత్తా అంత ఓపెన్ గా చెప్పిందంటూ రకరకాల మసాలా అద్దిపడేశారు. అయితే ఈ విషయంపై గుత్తాజ్వాల మళ్లీ ఓపెన్ కాలేదు. స్వతహాగా తనపై వచ్చే రూమర్లపై స్పందించని ప్రభాస్ కూడా ఆ విషయంపై నోరు మెదపలేదు.

కట్ చేస్తే ఇన్నాళ్లకు ఓ ఇంటర్వ్యూలో గుత్తా జ్వాలను ఇదే విషయమై యాంకర్ ఓ ప్రశ్న అడిగగా, గుత్తా క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ తనకు పరిచయం లేదని, కేవలం హీరోగానే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ‘‘నేను పొడుగుగా ఉంటాను కాబట్టి స్వతహాగా నాకు పొడగరి అబ్బాయిలంటే ఇష్టం. టాలీవుడ్ లో ప్రభాస్, మహేష్ బాబు ఇద్దరూ నచ్చుతారు. అంతేకానీ అంతా అనుకుంటున్నట్లు ఏమీ లేదు’’ అంటూ వివరణ ఇచ్చింది. దీంతో ఏడాది నుంచి అదే పనిగా రేగిన రూమర్లకు చెక్ పడినట్లయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gutta Jwala  Prabhas  Affair  Clarity  

Other Articles