తండ్రి బయోపిక్ లో బాలయ్య మరి అన్నీ చూపిస్తాడా? | Big Challenge to Balakrishna with Father Biopic.

Balakrishna announces the biopic of legendary ntr

Nandamuri Taraka Rama Rao, Nandamuri Taraka Rama Rao Biopic, Legendary NTR Legend Son, Legendary NTR Biopic, NTR Biopic, Balayya NTR Biopic, Movie on NTR, Nandamuri Balakrishna Movie, Balayya as NTR Biopic, Bala Krishna In NTR Role, NTR Biopic

Nandamuri Balakrishna has been introduced as the successor late Nandamuri Taraka Rama Rao. During his recent visit to his father’s birthplace Nimmakuru, he announced about the biopic of his father late Sri Nandamuri Taraka Rama Rao and he will reprise the role.He said that the script work is currently under process and the movie will reveal all the important aspects of his father’s life. All the details about the film will be announced soon.

ఎన్టీఆర్ బయోపిక్.. బాలయ్యనే హీరో

Posted: 02/06/2017 03:24 PM IST
Balakrishna announces the biopic of legendary ntr

తెలుగు సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలు దిద్దిన పేరు నందమూరి తారక రామారావు ఊరఫ్ ఎన్టీఆర్. ఆయన బయోపిక్ పై హాట్ కామెంట్లు చేశాడు తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ. నిమ్మకూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కోరిన బాలయ్య, ఎన్టీఆర్ పై సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇక ఈ చిత్రంలో హీరోగా తానే నటించనున్నానని తెలిపారు. ఎన్టీఆర్ పాత్రను పోషించడం తనకు లభించిన వరమని వ్యాఖ్యానించిన ఆయన, చిత్ర దర్శక, నిర్మాతలను త్వరలోనే ప్రకటిస్తానని నిమ్మకూరులో నేడు వెల్లడించారు. అతి త్వరలోనే మిగతా విషయాలన్నింటినీ తెలియజేస్తానని, హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ అసలు మొదలు కాలేదని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్నో అంశాలను అభిమానులు తెలుసుకోవచ్చని అన్నారు. స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అన్నాడు. నటవారసుడిగా కొన్ని సందర్భాల్లో తండ్రిని ఇమిటేట్ చేయటం, పౌరాణిక పాత్రల్లో కూడా అలాంటి హవాభావాలనే ప్రకటించటం గతంలో బాలయ్య నటనలో చాలాసార్లు చూశాం. అయితే పూర్తిస్థాయిలో ఇలా తండ్రిని ఆవిష్కరించటం మాత్రం నిజంగానే సాహసం అనే చెప్పాలి. 

మొత్తానికి బాలీవుడ్ లో ట్రెండ్ గా మారిన బయోపిక్ లను టాలీవుడ్ లోకి దించే యత్నం బాలయ్యతోనే మొదలవ్వబోతుందా? అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలేనా? లేక రాజకీయ కోణం కూడా ఇందులో ఆవిష్కరించబోతున్నాడా?. అదే ఉంటే చంద్రబాబు నాయుడు, లక్ష్మీపార్వతి లాంటి ఆసక్తికర ఎపిసోడ్స్ ను నిజాయితీతో ఎలా డీల్ చేయబోతున్నాడు అన్నదే ఆసక్తికరంగా మారబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  NTR  Biopic  

Other Articles